ఆంధ్రప్రదేశ్‌

‘హోదా’ను మరుగున పెట్టేందుకే ప్యాకేజీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఫిబ్రవరి 11: ఒంట్లో ఊపిరి ఉన్నంత వరకూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం కలిసికట్టుగా పనిచేస్తామని విభజన హామీల సాధన సమితి స్పష్టం చేసింది. ఎందుకూ కొరగాని ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించాలని కోరడం ముఖ్యమంత్రి చంద్రబాబు అవివేకానికి నిదర్శనమని మేధావుల ఫోరం ప్రతినిధి చలసాని శ్రీనివాస్ స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి ఆధ్వర్యంలో విశాఖలో శనివారం మూడో రోజు నిరసన దీక్ష కొనసాగింది. ఇప్పటికే ఆమరణ నిరాహార దీక్షగా ప్రకటించిన హోదా సాధన సమితి ప్రతినిధులు ఉద్యమాన్ని ఉద్ధృతం చేసే దిశగా ముందుకు సాగుతున్నారు. స్థానికుల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుండగా, విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు కుటుంబీకుడు గొట్టుముక్కల సత్యనారాయణ రాజు ప్రత్యేక హోదా ఉద్యమానికి మద్దతు పలుకుతూ దీక్షా శిబిరంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ ఐదున్నర కోట్ల ఆంధ్రుల భవిష్యత్ కోసం చేపట్టిన ఉద్యమానికి ప్రధాన రాజకీయ పార్టీల నుంచి మద్దతు కరువైనప్పటికీ యువత, ప్రజా సంఘాలు సంపూర్ణ సహకారం అందించడం చూస్తే హోదా ఆకాంక్షతో ప్రజానీకం ఎంతగా రగిలిపోతోందో అర్థం అవుతుందన్నారు. ఎన్నికలకు ముందు రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో బిజెపి, టిడిపిలు ప్రజల ముందు చేసిన వాగ్దానాలను ఒకసారి గుర్తు చేసుకోవాలన్నారు. కేంద్రంలో బిజెపి అధికారం చేపట్టిన తరువాత నాలుగోసారి బడ్జెట్ ప్రవేశపెట్టగా రాష్ట్రానికి వీసమెత్తు ప్రయోజనం కల్పించలేదని దుయ్యబట్టారు. తమిళనాడులో పోర్టు కారిడార్‌కు రూ.25వేల కోట్లు మంజూరు చేస్తే కనీసం మాకేమిటిస్తారని అడగలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు. కేంద్రంలో మంత్రి పదవి అనుభవిస్తున్న అశోక్ గజపతిరాజు ఎందుకు వౌన వహిస్తున్నారని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా ఇవ్వకుండా కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీని గొప్పగా చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, దానికి చట్టబద్ధత కోరడం హాస్యాస్పదమన్నారు. ప్రత్యేక హోదా సహా విభజన హామీలను విస్మరిస్తున్నప్రభుతా వలను ఎండగట్టాలన్నాఠు.
దీక్ష భగ్నం
ప్రత్యేక హోదా కోసం ఆమరణ దీక్ష చేస్తున్నవారిని శనివారం అర్థరాత్రి 10.45 ప్రాంతంలో పోలీసులు భగ్నం చేశారు. దీక్షలో అంబేద్కర్ వర్శిటీ విద్యార్థి సతీశ్ ఆరోగ్యం క్షీణించడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. దీక్షాపరులను కెజిహెచ్‌కు తరలించారు.