రాష్ట్రీయం

నిరుద్యోగులకు లక్షల్లో టోపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 6: సింగరేణిలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ అమాయక నిరుద్యోగులను మోసగించిన ముఠా గుట్టును టాస్క్ఫోర్సు పోలీసులు రట్టు చేశారు. బుధవారం టాస్క్ఫోర్స్ అదనపు డిప్యూటీ కమిషనర్ ఎన్ కోటిరెడ్డి తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వెల్లడించిన వివరాలిలావున్నాయి. సింగరేణి కాలరీస్ కంపెనీలో 48 సర్వేయర్ ట్రైనీ, మరో ఎనిమిది ఇతర పోస్టుల నియామకాలకు గానూ సింగరేణి యాజమాన్యం గత సంవత్సరం నోటిఫికేషన్ విడుదల చేసింది. వీరిని కొత్తగూడెం, ఖమ్మంలో గల సింగరేణి గనుల్లో నియమించాల్సి ఉంది. సదరు పోస్టులకు 9,644మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
రాత పరీక్షకు హాల్ టికెట్లు కూడా జారీ అయ్యాయి. కాగా డిసెంబర్ 20వ తేదీన జరగాల్సిన రాత పరీక్షను సింగరేణి యాజమాన్యం వివిధ కారణాల వల్ల రద్దు చేసింది. దీనిని ఆసరా చేసుకున్న సీనియర్ అకౌంట్ అఫీసర్ కిరణ్‌కుమార్ మంచిర్యాలకు చెందిన మోతె రమేశ్ (డ్రైవర్), శాతం రమేశ్ (కంప్యూటర్ ఆపరేటర్)లతో చేతులు కలిపి నిరుద్యోగులకు టోపీ వేసేందుకు పథకం పన్నాడు. ఇందులో భాగంగా మన్మోహన్, రషీద్, కొముయ్యలను ఏజెంట్లుగా నియమించుకున్నాడు. వీరు హైదరాబాద్‌లోని లక్డీకాపూల్‌లోని మూడు లాడ్జిలలో గదులు బుక్ చేసుకొని ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. సింగరేణిలో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మోడల్ పరీక్ష పత్రాలు ఇచ్చి ఉద్యోగం ఇప్పించే బాధ్యత తమదేనంటూ ఎర వేశారు. సుమారు 60మంది వద్ద ఒక్కో అభ్యర్థి నుంచి రూ. 10నుంచి 20వేలు అడ్వాన్సుగా వసూలు చేశారు.
ఉద్యోగం వచ్చిన తరువాత మరో పదివేలు ఇవ్వాలని కూడా ఒప్పందం కుదుర్చుకున్నారు. సింగరేణిలో ఓ సీనియర్ అకౌంట్ ఆఫీసర్ కదాని నమ్మిన అభ్యర్థులు తీరా సదరు అధికారి బిచాణా ఎత్తేయడంతో తాము మోసపోయామని తెలుసుకొని టాస్క్ఫోర్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. టాస్క్ఫోర్స్ పోలీసులు లక్డీకాపూల్‌లోని లాడ్జిలపై దాడులు నిర్వహించి సమీపంలోనే మరో లాడ్జిలో ఉన్న కిరణ్‌కుమార్‌తోపాటు మోతె రమేశ్, శాతం రమేశ్‌లను అరెస్టు చేశారు. వారి నుంచి రెండు లక్షల నగదుతోపాటు, మూడు సెల్ ఫోన్లు, ప్రశ్నపత్రాల బుక్‌లెట్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీరిని తదుపరి విచారణ నిమిత్తం సైఫాబాద్ పోలీసులకు అప్పగించారు. ఏజెంట్లు మన్మోహన్, రషీద్, కొమురయ్య పరారీలో ఉన్నారు.

మోసగాళ్ల వివరాలు వెల్లడిస్తున్న టాస్క్ఫోర్స్ అదనపు డిసిపి కోటిరెడ్డి