రాష్ట్రీయం

400 ఉపగ్రహాలూ ప్రయోగించవచ్చు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 15: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఓ అద్భుతాన్ని ఆవిష్కరించి యావత్ ప్రపంచం దృష్టినీ ఆకర్షించిందని అంతరిక్ష శాస్తవ్రేత్త జి మాధవన్ నాయర్ పేర్కొన్నారు. బుధవారం నాడిక్కడ మాట్లాడుతూ నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధనా కేంద్రం (షార్) నుండి ఒకే సారి 104 ఉపగ్రహాలను ప్రయోగించి అగ్రదేశాలకు సాధ్యం కాని రికార్డును సొంతం చేసుకుందని, వాస్తవానికి పిఎస్‌ఎల్‌వికి 104 మాత్రమే కాదు, 400 చిన్న ఉపగ్రహాలను తీసుకువెళ్లే సామర్థ్యం ఉందని పేర్కొన్నారు. తొలుత పది ఉపగ్రహాలను ఒకే వాహక నౌకతో ప్రయోగించామని, తర్వాత 35కు నేడు వందకు పెరిగాయని అన్నారు. మూడు నాలుగు కేజీల భారం ఉన్న ఉపగ్రహాలను రూపొందించిన పక్షంలో ఒకే సారి 300 నుండి 400 వరకూ ఉపగ్రహాలను ప్రయోగించే సత్తా భారత్‌కు ఇస్రోకు ఉందని పేర్కొన్నారు. అయితే ఒకసారి వినియోగించిన తర్వాత ఈ ఉపగ్రహాలు ఒకటి రెండేళ్లు మాత్రమే కక్ష్యలో ఉంటాయని, తర్వాత అవి పనిచేయడం మానివేస్తాయని అలా వీటి సేవలు ముగిసిన తర్వాత ఉపగ్రహాలు చాలా చిన్నవి కనుక వాటిని భూమి మీద గుర్తించడం, ఆ శకలాలను నిర్వీర్యం చేయడం కూడా కష్టమైన పని అని అన్నారు. అంతరిక్షంలో వ్యర్థ పదార్ధాలు పెరగడం శ్రేయస్కరం కాదని ఆయన వ్యాఖ్యానించారు.