తెలంగాణ

కులమతాలు లేని సమాజం రావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 17: కులమతాలు లేని సమాజం రావల్సి ఉందని కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. ఎన్‌ఎస్‌ఎస్, ఎన్‌వైకెఎస్ ల అధీనంలోని తెలంగాణ యువజన సంఘాల సమితి ఆధ్వర్యంలో పద్మశ్రీ పురస్కార గ్రహీతలకు నిర్వహించిన సత్కార సభలో బండారు దత్తాత్రేయ మాట్లాడారు. ఎవరి సిఫార్సులు లేకుండా ప్రతిష్ఠాత్మక వ్యక్తులను ఎంపిక చేశారని అన్నారు. మట్టిలో మాణిక్యాల వంటి వారికి ఈసారి తెలంగాణలో పద్మశ్రీ అవార్డులు దక్కాయన్నారు.
విద్యావేత్త కోటేశ్వరమ్మ, చేనేత రంగ నిపుణుడు చింతకింది మల్లేశం, శిల్పకళానిపుణుడు ఎక్కా యాదగిరి , సైంటిస్టు త్రిపురనేని హనుమాన్ చౌదరి , డాక్టర్ మహ్మద్ అబ్దుల్ వహీద్ , పర్యావరణవేత్త రామయ్య వంటి వారు పద్మశ్రీ పురస్కారం పొందారని, జీవితం అంతా ఎలాంటి మచ్చ లేకుండా అతిసామాన్యంగా వీరు జీవిస్తున్నారని బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు.
దేశాభివృద్ధిలో పాలుపంచుకుంటే ‘పద్మ అవార్డు దక్కుతుందని వీరంతా రుజువు చేశారని పేర్కొన్నారు. నెహ్రూ యువ కేంద్రానికి మోదీ ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిందని అన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న యూత్ క్లబ్‌లకు నేరుగా డబ్బులు చెల్లించే కార్యక్రమాన్ని కేంద్రం ప్రారంభించిందని, తెలంగాణలో ఐదువేల క్లబ్‌లు ఉన్నాయని ఈ క్లబ్‌లు అనేక సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయని చెప్పారు.
కులం, మతం, ప్రాంతాలను రెచ్చగొడుతూ రాజకీయాలు చేయాలని చూసే వారికి తగినబుద్ధి చెప్పాలని ఆయన హితవు పలికారు. ఈ కార్యక్రమంలో నెహ్రూ యువకేంద్ర సంఘటన్ జాతీయ ఉపాధ్యక్షుడు పేరాల శేఖర్‌రావు, ఎం కరుణాకర్‌రెడ్డి, ఎంఎస్‌ఎన్ రెడ్డి, ఎన్ రామచందర్‌రావు, ఎంఎల్‌ఎ డాక్టర్ కె లక్ష్మణ్ , వేముల నరేందర్‌రావు, జె కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.