ఆంధ్రప్రదేశ్‌

మాతృభాషలో డాక్యుమెంట్లు ఇవ్వనందుకు ఆగ్రహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 17: ఒక డిటెన్యూను నిర్బంధించేందుకు కారణాలను వివరిస్తూ ఇచ్చే ఉత్తర్వులు, ఇతర డాక్యుమెంట్లను మాతృభాషలో కాకుండా ఇతర భాషల్లో ఇచ్చినందుకు చిత్తూరు జిల్లా కలెక్టర్, పోలీసు సూపరింటెండెంట్‌కు హైకోర్టు 25వేల రూపాయల పెనాల్టీని విధిస్తూ తీర్పు ఇచ్చింది. జస్టిస్ సురేష్ కుమార్ కైత్, జస్టిస్ యు దుర్గాప్రసాద్‌రావుతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఒక కేసులో తన భర్తను డిటెన్షన్ చేస్తూ దీనికి కారణాలను వివరిస్తూ మళయాళంలో చిత్తూరు జిల్లా కలెక్టర్, ఎస్పీ ఉత్తర్వులు ఇచ్చారని, ఇతర డాక్యుమెంట్లను తెలుగు, ఇంగ్లీషులో ఇచ్చారంటూ సివి సోనా అనే మహిళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన భర్తను డిటెన్షన్ చేస్తూ 2016 జూన్ 12వ తేదీన జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారన్నారు. తన భర్తకు మళయాళం తెలుసని పిటిషనర్ పేర్కొన్నారు. ప్రివెన్షన్ ఆఫ్ డెటెన్షన్ చట్టం కింద అధికారులు సంబంధిత డాక్యుమెంట్లను నిర్బంధానికి గురయ్యే వ్యక్తి మాతృభాషలో ఇవ్వాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా హైకోర్టు జోక్యం చేసుకుని ‘ అనేక సార్లు సుప్రీం కోర్టు, హైకోర్టులు పిటిషనర్లకు మాతృభాషలో ఉత్తర్వులు, డాక్యుమెంట్లు ఇవ్వాలని తీర్పులు ఇచ్చాయి. ప్రస్తుతం తమ ముందున్న కేసు మొదటిదేమీ కాదు. ఎస్పీ ఇటువంటి తెలివితక్కువ తప్పు ఎందుకు చేస్తున్నట్లు ’ అని పేర్కొంది. కడప జైల్లోన్న డిటెన్యూను వెంటనే విడుదల చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఎస్పీ నిర్లక్ష్యం వల్ల డిటెన్యూ తన వాదనను సమర్ధంగా వినిపించుకోలేకపోతున్నారరు. చట్టం డిటెన్యూకు హక్కులను కల్పించింది. రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను ఏడు నెలల పాటు డిటెన్యూ కోల్పోయాడు అని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసులో ఎస్పీ నెల వేతనం నుంచి పది రోజుల్లో ఐదు వేల రూపాయలను రికవరీ చేయాలని పేర్కొంది. మొత్తం 25వేల రూపాయల్లో పదివేల రూపాయలను హైకోర్టు లీగల్ సర్వీసు కమిటీకి చెల్లించాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. మరో 15వేల రూపాయలను పిటిషనర్‌కు చెల్లించాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.