రాష్ట్రీయం

సూర్యాపేట వాసికి ఐఈఎస్‌లో ప్రథమ ర్యాంక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, జనవరి 6: యుపిపిఎస్‌సి ఆధ్వర్యంలో నిర్వహించిన ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్ (ఐఈఎస్) పరీక్షలో నల్లగొండ జిల్లా సూర్యాపేట పట్టణానికి చెందిన షేక్ సిద్ధిక్ హుస్సేన్ ఎలక్ట్రికల్ విభాగంలో జాతీయ స్థాయిలో ప్రథమర్యాంక్ సాధించి ఇండియన్ రైల్వే సర్వీస్‌లో గ్రూప్-ఎ క్యాడర్‌కు ఎంపికయ్యాడు. పట్టణానికి చెందిన హాస్టల్ వార్డెన్ షేక్ హుస్సేన్ కుమారుడైన సిద్ధిక్ బాల్యం నుండే చదువులో ప్రతిభ కనబరుస్తూ జాతీయస్థాయిలో ప్రతిష్టాత్మకంగా భావించే ఐఈఎస్ పరీక్షలో మొదటిస్థానంలో నిలిచి పేరు ప్రఖ్యాతులు సాధించాడు. గుజరాత్‌లోని గాంధీనగర్ ఐఐటిలో బిటెక్ పూర్తిచేసిన హుస్సేన్ టిసిఎస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఏడాదిపాటు పనిచేశాడు. ఐఈఎస్ సాధించాలనే లక్ష్యంతో ఉద్యోగానికి రాజీనామా చేసి శిక్షణ పొందాడు. గత ఏడాది జూన్‌లో నిర్వహించిన ఐఈఎస్ పరీక్షలో ఎలక్ట్రికల్ విభాగంలో జాతీయస్థాయిలో ప్రథమర్యాంక్ సాధించాడు. అనంతరం యుపిపిఎస్‌సి ఇంటర్వ్యూలో విజయం సాధించి రైల్వే ఇంజనీరింగ్ విభాగంలో గ్రూప్-ఎ క్యాడర్ కింద ఉద్యోగం పొందాడు. స్వస్థలమైన సూర్యాపేటకు సిద్ధిక్ బుధవారం చేరుకోగా తల్లిదండ్రులు షేక్ హుస్సేన్, కృష్ణవేణితో పాటు పలువురు ప్రముఖులు అభినందించారు.
ఈ సందర్భంగా సిద్ధిక్ మాట్లాడుతూ తల్లిదండ్రుల ప్రోత్సాహంతో, పట్టుదలతో చదివి ఈ స్థాయికి చేరినట్లు చెప్పాడు. భవిష్యత్తులో ప్రతిభ గల పేద విద్యార్థులకు సహాయం అందిస్తానని తెలిపాడు.