రాష్ట్రీయం

కొత్త సీఎస్ కల్లం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఫిబ్రవరి 20: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ప్రస్తుత ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ కల్లం నియామకం దాదాపు ఖరారయినట్లు తెలుస్తోంది. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి ఠక్కర్ ఈనెలాఖరుకు పదవీ విరమణ చేయనున్నారు. ఆయనకు ఇప్పటికే ఆరునెలలు పొడిగింపు ఇచ్చిన విషయ ం తెలిసిందే. అయితే ఆయనను ప్రతిష్ఠాత్మకమైన ఎకనమిక్ డెవలెప్‌మెంట్ బోర్డుకు ఉపాధ్యక్షుడిగా నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ బోర్డుకు ముఖ్యమంత్రి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. అమరావతి అభివృద్ధి, విదేశీ సంస్థల నిధులు, కంపెనీల పెట్టుబడులు దృష్టిలో ఉంచుకుని ఆయనకు ఆ పదవి ఇవ్వనున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.
ఇదిలాఉండగా, స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ కల్లం ప్రధాన కార్యదర్శిగా నియమితులు కానున్నట్లు సమాచారం. అయితే, ఆయన ఒక నెలలో పదవీ విరమణ చేయవలసి ఉంది. ఇప్పటివరకూ రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారికి పెద్దగా అవకాశం రానందున, ఆయనకు ఆ పదవి ఇవ్వడం ద్వారా సామాజిక సమీకరణను సమం చేయవచ్చన్న యోచన కూడా ప్రభుత్వ నిర్ణయంలో కనిపిస్తోందంటున్నారు. దీనికి సంబంధించి రెడ్డి వర్గానికి చెందిన టిడిపి సీనియర్లు బాబుకు సలహా ఇచ్చారని చెబుతున్నారు.
అయితే, స్పెషల్ చీఫ్ సెక్రటరీ హోదా ఉన్న అనిల్ చంద్ర పునేఠాకు ఈసారి కూడా నిరాశ తప్పేలా లేదు. ప్రస్తుత సమీకరణలు పరిశీలిస్తే ఒకవేళ కల్లానికి నెలరోజులతోపాటు అదనంగా 6 నెలలు పొడిగింపు ఇచ్చినా, ఆ తర్వాత అవకాశం కచ్చితంగా పరిపాలనా సంస్కరణల్లో విశేషానుభవం ఉన్న పునేఠాకు ఆ పదవి దక్కే అవకాశం ఉంది.