రాష్ట్రీయం

ఇదేం చోద్యం పురుషోత్తమా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 20: గోదావరి నది ఎడమ గట్టుపై సీతానగరం మండలం పురుషోత్తపట్నం వద్ద రూ.1638 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించతలపెట్టిన పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకానికి భూసేకరణపై నెలకొన్న వివాదం పరిష్కారం కాకుండానే పనులు ప్రారంభించేస్తున్నారు. రైతుల భూము ల్లో మాత్రం పైపులైన్ నిర్మాణ పనులు మొదలుపెట్టారు. సోమవారం దేవీపట్నం మండలం నేలకోట వద్ద పురుషోత్తపట్నం నిర్మాణ సంస్థ మెగా ఇంజనీరింగ్ కంపెనీ భారీ ప్రెజర్‌మెయిన్ నిర్మాణ పనులు చేపట్టింది. ప్రెజర్‌మెయిన్ ఎలైన్‌మెంట్ భూమిలో నాలుగున్నర మీటర్ల లోతులో పైపులైన్లను అమర్చే ప్రక్రియ మొదలైంది. వాస్తవానికి ఈ పథకానికి రైతులు ఇంకా పూర్తి స్థాయిలో భూములు ఇచ్చేందుకు అంగీకరించలేదు. పరిహారం విషయమై పీటముడి పడటంతో ఇంతవరకు ఎక్కడా రైతులు ఒక ఎకరం భూమి కూడా అధికారులకు స్వాధీనం చేయలేదు. అవసరమైన భూములను సేకరించడానికి రెవెన్యూ శాఖ కసరత్తు చేస్తోంది. ఈలోగా పనులు మాత్రం మొదలెట్టేశారు. రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్టుగా ప్రభుత్వం తీరు ఉందని రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. నిర్దేశిత గడువులోగా పనులు పూర్తికావాలని ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలతో కాంట్రాక్టు సంస్థ భూములు లేకపోయినా పనులు మాత్రం చేపట్టేసింది. ఈ పథకంలో రెండుచోట్ల పంపుహౌస్‌ల నిర్మాణం చేపడతారు. ఈ రెండు చోట్లా కలిపి 298.65 ఎకరాల భూమి అవసరమని గుర్తించారు. ఇందులో పురుషోత్తపట్నం వద్ద నిర్మించే పంపుహౌస్ వద్ద హెడ్ వర్క్సు నిమిత్తం 203.65 ఎకరాలను సేకరించాల్సి ఉంది. పోలవరం ఎడమ కాల్వ 57 కిలోమీటర్ల వద్ద నిర్మించే పంపుహౌస్ హెడ్ వర్క్సు నిర్మాణం కోసం 95.18 ఎకరాలు సేకరించాల్సివుంది. ఇక్కడైతే ఇంకా సర్వే కూడా పూర్తికాలేదు. పంపుహౌస్‌ల వద్ద జల వనరుల శాఖకు చెందిన భూములు తప్ప మిగిలిన అన్ని చోట్ల ఈ పథకం వెళ్ళే ప్రాంతంలో రైతుల నుంచే భూములు సేకరించాల్సి వుంది. కానీ ఎక్కడా రైతులు భూములు స్వాధీనం చేయలేదు. నిన్న మొన్నటివరకు భూ సేకరణకు గ్రామ సభలు కూడా నిర్వహించని అధికార యంత్రాంగం ఇపుడు ఏకంగా గిరిజన, గిరిజనేతరుల భూముల్లో పనులు మొదలుపెట్టేసింది.
పంపుహౌస్ నుంచి 10 కిలో మీటర్ల ప్రెజర్‌మెయిన్ అంటే ఒత్తిడి కలిగిన జలాలను పైపులైన్ ద్వారా తరలించి, అక్కడ నుంచి పోలవరం ఎడమ కాల్వకు అనుసంధానంచేస్తారు. ఈ పది కిలోమీటర్ల పైపులైన్ (ప్రెజర్ మెయిన్) శివారు ప్రాంతమైన నేలకోట గ్రామ శివారులో పైపులను భూమిలోకి దించుతున్నారు. మొత్తం నాలుగుచోట్ల పైపులైన్ల తయారీ యూనిట్లు, ఒక చోట పైపులకు రంగులు వేసి స్టాక్ పాయింట్‌ను ఏర్పాటుచేశారు. మెగా ఇంజనీరింగ్ సంస్థ ఈ పథకం పనులు చేపట్టింది. ఐదు వరుసల పైపులను అంటే దాదాపు 50 కిలోమీటర్ల పైపులైన్‌ను నిర్మించే పనులు ప్రారంభించారు. ఒక్కోటి ఆరు మీటర్ల పొడవుతో 3.50 మీటర్ల వ్యాసార్ధంలో ఇనుప పైపులను శరవేగంగా తయారు చేస్తున్నారు. ఇక్కడ తయారీ కేంద్రాల్లో రోజుకు ఇరవై పైపుల చొప్పున తయారవుతున్నాయి. పైపులైన్ పనులకు ఎక్కడైతే శంకుస్థాపన చేశారో అక్కడ పైపులైన్లను క్రేన్లతో భూమిలో అమర్చే పనులను కాంట్రాక్టు సంస్థ సోమవారం మొదలు పెట్టింది. భారీ క్రేన్లతో 4.50 మీటర్ల లోతులో తవ్విన భూమిలో పైపులను ఐదు వరుసలుగా అమర్చే ప్రక్రియ చేపట్టారు.

చిత్రాలు..పురుషోత్తపట్నం’ పథకం పైపుల స్టాకు పాయింటు
* నేలకోట శివార్లలో పోలవరం ఎడమ కాల్వ వద్ద పైపులను అమర్చుతున్న దృశ్యం