రాష్ట్రీయం

రూ.819 కోట్లతో ఎంఎంటిఎస్ రెండో దశ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 20: హైదరాబాద్‌లో ఎంఎంటిఎస్ రెండవ దశ రైలు మార్గం నిర్మాణం పనులు నిర్దేశించిన కాలపరిమితిలోగా పూర్తి చేస్తామని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ రవీంద్ర గుప్తా ప్రకటించారు. ఎంఎంటిఎస్ రెండవ దశ పనులు 103 కి.మీ పొడువునా విస్తరించి ఉన్నాయి. ఈ పనులు పూర్తి చేసేందుకు రూ.819 కోట్లు వ్యయమవుతుంది. రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ ఈ పనులను చేపట్టంది. వౌలాలి-ఘట్‌కేసర్ మధ్య 14 కిమీ పనులు చురుకుగా సాగుతున్నాయి. వౌలాలి-సనత్‌నగర్ మధ్య 23కిమీ మధ్య సింగిల్ లేన్ ఉంది. ఈ మార్గాన్ని డబుల్ లేన్ చేసే పనులు చేపట్టారు. నగరంలో జనసమ్మర్ధం ఉన్న ప్రాంతాల ద్వారా ఈ రైలు మార్గం వెళుతుంది. సికింద్రాబాద్-బొలారం మధ్య డబుల్ లేన్‌ను విద్యుద్దీకరణ చేస్తున్నారు. బొలారం-మేడ్చల్ మధ్య డబుల్ లేన్ వేస్తున్నారు. ఎంఎంటిఎస్ రెండవ దశలో 16 భారీ వంతెనలను నిర్మించాల్సి ఉంది. ఇందులో 11 వంతెనల పనులు చురుకుగా సాగుతున్నాయి. వాడి-రాయిచూర్-గుంతకల్ మధ్య రైల్వే మార్గం విద్యుద్దీకరణ పనులు, హోస్పేట, గుంతకల్ మధ్య విద్యుద్దీకరణ పనులు చురుకుగా సాగుతున్నాయి.ఈ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ రవీంద్ర గుప్తా మాట్లాడుతూ ఆర్‌విఎన్‌ఎల్, రైల్వే అధికారుల మధ్య సమన్వయంతో పనులు పూర్తి కావాలని కోరారు. ఎంఎంటిఎస్ రెండవ దశలో సనత్‌నగర్-వౌలాలి మధ్య రక్షణ శాఖకు సంబంధించి స్ధల సమస్యలను పరిష్కరించాలని ఆర్‌విఎన్‌ఎల్ అధికారులు కోరారు. కొంత భూమిని రక్షణ శాఖ నుంచి సేకరించాల్సి ఉందన్నారు. రక్షణ శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఈ సమావేశంలో అదనపు జిఎం ఉమేష్ సింగ్, చీఫ్ ఆపరేషనల్ మేనేజర్ జెఎన్ ఝా పాల్గొన్నారు.

శుక్రవారం హైదరాబాద్‌లో రైల్వే అధికారులతో సమీక్షాసమావేశంలో జిఎం రవీందర్ గుప్తా