రాష్ట్రీయం

200 యూనిట్లు దాటితే బాదుడే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 6: ఆంధ్రా డిస్కాంలు రూ.5700 కోట్ల విద్యుత్ లోటును పూడ్చేందుకు విద్యుత్ టారిఫ్ పెంపుదలపై కొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చాయి. దీని ప్రకారం విద్యుత్ వాడకం రెండు వందల యూనిట్లు దాటితే సవరించిన విద్యుత్ చార్జీలు వర్తించే విధంగా చూడాలని ఏపిఇఆర్‌సిని కోరనున్నాయి. అంటే రెండు వందల యూనిట్ల లోపు విద్యుత్ వాడే వారికి విద్యుత్ చార్జీలు పెరగవు. ఇప్పటికే గృహ విద్యుత్ వినియోగదారులను మూడు గ్రూపులుగా విభజిస్తూ ప్రతిపాదనలు సిద్ధం చేసిన విషయం విదితమే. ఆంధ్రాలో రెండు డిస్కాంలు ఉన్నాయి. ఒకటి తూర్పు డిస్కాం, రెండు సదరన్ డిస్కాం. మొత్తం వినియోగదారులు 1.48 కోట్ల మంది ఉన్నారు. ఇందులో 1.22 కోట్ల మందికి విద్యుత్ చార్జీల ప్రభావం పడకుండా చూడాలని రాష్ట్రప్రభుత్వం డిస్కాంలను ఆదేశించినట్లు సమాచారం. రెండు డిస్కాంల పరిధిలో 200 యూనిట్ల లోపు విద్యుత్‌ను వినిమయం చేసే వారు 1.6 కోట్ల మంది ఉన్నారు. ఒక అంచనా ప్రకారం సవరించిన విద్యుత్ చార్జీలకు ఏపిఇఆర్‌సి అనుమతిస్తే ఏప్రిల్ 1 నుంచి 14 లక్షల మంది వినియోగదారులపైనే భారం పడుతుంది. దాదాపు 84 శాతం మంది విద్యుత్ వినియోగదారులకు ఒక వేళ ఏపిఇఆర్‌సి విద్యుత్ చార్జీలు పెంచితే ప్రభావం పడకుండా చూడాలని ఏపి డిస్కాంలు యోచిస్తున్నాయి. దీంతొ పాటు కోళ్ల పెంపకం రైతులలు 33వేల మంది, రొయ్యల పెంపకం రైతులు 22వేల మంది ఉన్నారు. వీరికి యూనిట్ కు రూ.3.90పైసలు వసూలు చేస్తున్నారు. వీరికి కూడా ఆర్ధిక భారం తగ్గించే విధంగా విద్యుత్ చార్జీలను తగ్గించాలని ప్రతిపాదించనున్నారు. అలాగే డెయిరీ రైతులు 11వేల మంది ఉన్నారు. వీరి నుంచి ప్రస్తుతం యూనిట్‌కు రూ.2.75 పైసలు వసూలు చేస్తున్నారు. వీరికి కూడా విద్యుత్ చార్జీలను తగ్గించే అవకాశం ఉందని సమాచారం. ఏపి డిస్కాంలు తమకు రూ.5700 కోట్ల లోటు ఉందని ప్రతిపాదించిన విషయం విదితమే. ఇందులో 4500 కోట్ల రూపాయల మేర లోటును భర్తీ చేసే విధంగా సబ్సిడీని రాష్ట్రప్రభుత్వం భరించవచ్చు. అంటే కనిష్టం రూ.1200 కోట్ల మేర విద్యుత్ చార్జీలు గత ఏడాది మాదిరిగా పెంచే అవకాశాలు ఉన్నాయి. కాగా ఇంతవరకు ఏపి డిస్కాంలు వార్షిక రెవెన్యూను సమర్పించినా, శ్లాబ్‌లను గ్రూపులుగా విభజిస్తున్నట్లు ప్రతిపాదించినా, విద్యుత్ టారిఫ్ పెంపుపై నిర్దిష్టప్రతిపాదనలు ఏపిఇఆర్‌సికి సమర్పించలేదు. ఏపిఇఆర్‌సి బహిరంగ విచారణ జరిపి, ఈ ప్రతిపాదనలు ఆమోదించిన తర్వాతే సవరించిన కొత్త రేట్లు ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలులోకి వస్తాయి. కాగా తాము ప్రతిపాదించిన కొత్త విద్యుత్ చార్జీలపై విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వివరించినట్లు సమాచారం. పేదలు, మధ్యతరగతి వర్గాలపై భారం పడకుండా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు గట్టిగా ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. గత ఏడాది కూడా 1200 కోట్ల మేర విద్యుత్ చార్జీలను పెంచిన విషయం విదితమే. ఈ సారి కూడా మొత్తం మీద మూడు శాతం మించకుండా విద్యుత్ చార్జీలను పెంచాలని ప్రభుత్వం డిస్కాం అధికారులను ఆదేశించినట్లు తెలిసింది.