రాష్ట్రీయం

సిసిఐ ఆస్తుల వేలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 27: సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) ఆదిలాబాద్ యూనిట్ ఆస్తుల వేలాన్ని నిలిపివేయడానికి హైకోర్టు సోమవారం నిరాకరించింది. అయితే వేలంలో విజయం సాధించిన వారికి ఆస్తులను అందించడంలో సిసిఐకి 3నెలల వ్యవధి ఇచ్చేందుకు అనుమతించింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాధన్, జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన డివిజన్ బెంచ్ సిసిఐ ఎంప్లాయిస్ యూనియన్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించింది. పిటీషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ఎస్ రామచంద్రరావు హాజరయ్యారు.
రాష్టప్రతిని ప్రతివాదిగా చేర్చాలా, వద్దా?
రాష్టప్రతిని ప్రతివాదిగా చేర్చాలా వద్దా అనే అంశంపై కేంద్ర ప్రభుత్వం మంగళవారంలోగా స్పష్టం చేయాలని హైదరాబాద్ హైకోర్టు సోమవారం ఆదేశించింది. జస్టిస్ వి రామసుబ్రమణియన్, జస్టిస్ జె ఉమాదేవిలతో కూడిన బెంచ్ ఈ మేరకు అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ నారాయణ రెడ్డిని ఆదేశించింది. ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కేసులో ఎ-1గా కేసులు ఎదుర్కొంటున్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ పి అప్పారావును కొనసాగించడాన్ని ప్రశ్నిస్తూ కాంగ్రెస్ నేత వి హనుమంతరావు దాఖలు చేసిన పిటీషన్‌ను డివిజన్ బెంచ్ విచారించింది. సెంట్రల్ యూనివర్శిటీ విసిలను విజిటర్ హోదాలో రాష్టప్రతి నియమిస్తారని, కనుక ఈ వ్యవహారంపై కేంద్రం తన వైఖరిని స్పష్టం చేయాలని ఆదేశించింది.