రాష్ట్రీయం

మళ్లీ మిగులే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 28: తెలంగాణ వార్షిక బడ్జెట్ నాలుగోసారీ మిగులుతో ప్రవేశపెట్టబోతుంది. వరుసగా మూడు సార్లు మిగులు బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రభుత్వం, వచ్చే వార్షిక బడ్జెట్‌నూ సుమారు రూ.4 వేల కోట్ల మిగులుతో ప్రవేశ పెట్టబోతుంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014-15లో రూ.301 కోట్ల మిగులుతో తొలి బడ్జెట్ ప్రవేశపెట్టగా, 2015-16లో రూ.531 కోట్ల మిగులుతో, మూడోసారి (ప్రస్తుత) బడ్జెట్‌లో రూ.3718 మిగులుతో ప్రవేశపెట్టింది. ఆదాయ వృద్ధి రేటు ఈ ఏడాది 20 శాతం వరకు ఉండటంతో ఈసారి ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లో మిగులు రూ.4000 కోట్లకు పైగానే ఉండబోతుందని సమాచారం. మొదటి బడ్జెట్ 2014-15లో మొత్తం రాబడి రూ.80,090.33 కోట్లు కాగా, రెవిన్యూ వ్యయం రూ.79,789.31 కోట్లు చూపించటంతో రూ.301 కోట్లు మిగులు కనిపించింది. 2015-16లో రాబడి 94,131 కోట్లు కాగా రెవిన్యూ వ్యయం రూ.93,600 కోట్లతో రూ.531 కోట్ల మిగులు తేలింది. 2016-17లో మొత్తం రాబడి రూ.1,00,925 కోట్లు కాగా రెవిన్యూ వ్యయం రూ.97,206 కోట్లతో రూ.3714 మిగులు తేలింది. 2016-17లో మొత్తం బడ్జెట్ అంచన రూ.1,30,416 కోట్లు కాగా ఇందులో ప్రభుత్వ రుణాలు రూ.25,580 కోట్లు మినహాయింపుతో మొత్తం రాబడి 1,04,849 కోట్లు వస్తుందని అంచనా వేసింది. గత ఏడాది కంటే ఈసారి వృద్ధిరేటు 20 శాతంగా నమోదైంది. ఈసారి 22.7 శాతం వృద్ధి రేటు ఉంటుందని అంచనా వేయగా నోట్ల రద్దు ప్రభావం వల్ల స్వల్పంగా ఆదాయం తగ్గినప్పటికీ వృద్ధి రేటులో మాత్రం ప్రభావం కనిపించలేదు. ప్రస్తుత బడ్జెట్‌లో రాష్ట్ర సొంత పన్నుల ద్వారా వచ్చే ఆదాయాన్ని రూ.54,870 కోట్లకు అంచన వేసింది. పనే్నతర ఆదాయం రూ.17,542 కోట్లుగా, కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా రూ.13,955 కోట్లుగా, కేంద్ర గ్రాంట్స్ ద్వారా రూ.14,557 కోట్లుగా మొత్తంగా రాష్ట్ర రాబడి రూ.1,00,925 కోట్లుగా అంచన వేసింది. నోట్ల ప్రభావం వల్ల ఒక్క స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ల ఆదాయంలో తప్ప మిగతా రంగాలలో అంచనలు తప్పలేదు. పైగా నోట్ల రద్దు ప్రభావం ఉన్నప్పటికీ ఆదాయ వృద్ధిలో 20 శాతం కనిపించడంతో మిగులు బడ్జెట్‌తో రూ.1,40,000 కోట్ల నుంచి రూ.1,45,000 కోట్ల మధ్యలో బడ్జెట్‌ను ప్రవేశ పెట్టడానికి కసరత్తు జరుగుతోంది. నాలుగవసారి కూడా మిగులు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుండటంతో దేశంలో మిగులు బడ్జెట్ కలిగిన రాష్ట్రాలలో తెలంగాణ తన రికార్డును పదిలం చేసుకోబోతుంది.
ఇదీ మిగులు లెక్క

2014-15లో రూ.301 కోట్లు
2015-16లో రూ.531 కోట్లు
2016-17లో రూ.3718 కోట్లు
2017-18లో రూ.4000 కోట్లు?