రాష్ట్రీయం

యుద్ధ నౌకల నిర్మాణంలో డిఆర్‌డిఓ సహకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 7: యుద్ధ నౌకల తయారీలో డిఆర్‌డిఓ (రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ) సాంకేతిక సహకారాన్ని వినియోగించుకుంటాం.. స్వదేశీ సాంకేతికత వినియోగానికి సంబంధించి డిఆర్‌డిఓతో 15 ఏళ్లకు రోడ్ మ్యాప్ తయారు చేస్తున్నామని భారత నౌకాదళ ప్రధానాధికారి అడ్మిరల్ ఆర్‌కె ధావన్ తెలియచేశారు. కోల్‌కతాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ షిప్‌యార్డులో తయారైన యుద్ధనౌక ఐఎన్‌ఎస్ కడ్మత్‌ను గురువారం ఆయన విశాఖలో లాంఛనప్రాయంగా జల ప్రవేశం చేయించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ధావన్ మాట్లాడుతూ మేక్ ఇన్ ఇండియాలో భాగంగా 90 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన రెండో యుద్ధ నౌక కడ్మత్ నౌకాదళంలో చేరడం ముదావహమన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ఈ నౌక భారత నౌకాదళానికి ఎనలేని సేవలు అందిస్తున్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. కడ్మత్ అంటే లక్షద్వీప్‌లోని ఒక దీవి పేరు అని ఆయన చెప్పారు. గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ నుంచి 1961లో తొలి యుద్ధ నౌక బయటకు వచ్చిందన్నారు. అప్పటి నుంచి గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ నౌకాదళానికి కావల్సిన అనేక యుద్ధ నౌకలను, నిఘా నౌకలను అందిస్తూ వస్తోందన్నారు.
సంవత్సరాల తరబడి యుద్ధ నౌకల తయారీకి శ్రమిస్తున్న కార్మికులందరికీ ఆయన కృతజ్ఞతలు తెలియచేశారు. యుద్ధ నౌకల తయారీలో నౌకాదళ షిప్ డిజైన్ సెంటర్, డిఆర్‌డిఓ ఎంతగానో సహకరిస్తున్నాయని ధావన్ అన్నారు. డిఆర్‌డిఓ సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు 15 ఏళ్ళకు రోడ్ మ్యాప్ తయారు చేస్తున్నామని ఆయన చెప్పారు. స్వదేశీ పరిజ్ఞానంలో స్వయం సమృద్ధి సాధించామని చెప్పడానికి డిఆర్‌డిఓ, షిప్ డిజైన్ సెంటర్‌లు అందించిన ఐఎన్‌ఎస్ కడ్మత్ నిలువెత్తు నిదర్శనమని ఆయన అన్నారు. యుద్ధ నౌకల తయారీలో మరింత స్వయం సమృద్ధి సాధించేందుకు బ్లూప్రింట్ సిద్ధం చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికే భారత దేశంలోని వివిధ షిప్‌యార్డుల్లో 46 యుద్ధ నౌకలు, సబ్‌మెరైన్‌లు తయారవుతున్నాయని ధావన్ తెలియచేశారు. వీటిని చాలా వరకూ స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతోనే తయారు చేస్తున్నామని, అవసరం మేరకే ఇతర దేశాల సాంకేతికతను కొంత వరకూ వినియోగించుకుంటామని థావన్ చెప్పారు.
వచ్చేనెలలో విశాఖలో జరగనున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో పాల్గొనే కొత్త నౌకల్లో ఇది ఒకటని ఆయన చెప్పారు.్భరత నౌకాదళంలో తూర్పు నౌకాదళ భుజస్కందాలపై ఎక్కువ బాధ్యతలు ఉన్నాయని చెప్పారు. తూర్పు తీరాన్ని దాటి మలాక్కాడ్ స్టేట్స్‌కు సంవత్సరానికి 70 వేల వాణిజ్య నౌకలు ప్రయాణిస్తున్నాయని, వాటి రక్షణ బాధ్యత కూడా తూర్పు నౌకాదళంపై ఉందని ఆయన చెప్పారు. భవిష్యత్‌లో ఎటువంటి సవాళ్ళనైనా ఎదుర్కొనేందుకు తూర్పు నౌకాదళం సిద్ధంగా ఉండాలని థావన్ విజ్ఞప్తి చేశారు. నౌకాదళం సమర్థవంతంగా పనిచేయడం వలనే ప్రజలు ప్రశాంతంగా నిద్రపోతున్నారని ఆయన అన్నారు. అనంతరం జరిగిన విలేఖరుల సమావేశంలో ధావన్ మాట్లాడుతూ వచ్చే నెలలో విశాఖలో జరగనున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ(ఐఎఫ్‌ఆర్)లో 52 దేశాలు పాల్గొంటున్నాయని చెప్పారు. ఇందులో 24 దేశాల నుంచి యుద్ధ నౌకలు వస్తున్నాయని, 34 దేశాల నౌకాదళాధిపతులు పాల్గొంటున్నారని ఆయన వివరించారు. ఈ ఫ్లీట్ రివ్యూలో పాకిస్తాన్ పాల్గొనడం లేదని ఆయన చెప్పారు. అరిహంత్ న్యూక్లియర్ సబ్‌మెరైన్ ఈ ఫ్లీట్ రివ్యూలో పాల్గొంటుందా.. అని అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పడానికి నిరాకరించారు.
chitram..
విశాఖపట్నంలో గురువారం ఐఎన్‌ఎస్ కడ్మత్‌ను జలప్రవేశం చేయించిన
అనంతరం విలేఖరులతో మాట్లాడుతున్న భారత నౌకాదళాధిపతి ఆర్‌కె ధావన్