రాష్ట్రీయం

అధికారుల పక్షపాతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 7: శాసనసభ, మండలిలోని ప్రిసైడింగ్ అధికారులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని శాసనమండలి ప్రతిపక్ష వైకాపా నేత సి.రామచంద్రయ్య ఆరోపించారు. మీడియా పాయింట్‌లో మాట్లాడిన ఆయన పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో చట్టసభలను కాపాడే బాధ్యత ప్రిసైడింగ్ అధికారులదేనన్నారు. సభాపతి స్థానంలో కూర్చునే వ్యక్తి పార్టీలకు అతీతంగా నిష్పాక్షికంగా వ్యవహరించాలన్నారు. ఒక పార్టీ టిక్కెట్‌పై ఎన్నికైన ప్రజాప్రతినిధులు వేరే పార్టీకి కేటాయించిన సీట్లలో కూర్చుంటే ఆహ్వానిస్తున్నారని, ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇద్దరు ప్రిసైడింగ్ అధికారులూ వినీ విననట్లు ఉంటున్నారని, ఇది తప్పని చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. కౌన్సిల్‌లో చాలా ఘోరంగా ఉందని, కాంగ్రెస్ పార్టీపై గెలిచినవారు వేరే పార్టీకి పోతే కంప్లైంట్ ఇచ్చినా యాక్షన్ తీసుకోలేని పరిస్థితుల్లో ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉన్నాడంటే ఇందులో మతలబు ఉందన్నారు. ప్రిసైడింగ్ అధికారి నిర్ణయాలను సమీక్షించే అధికారాన్ని ఎన్నికల కమిషన్‌కు లేదా పార్లమెంటరీ కమిటీకి ఇవ్వాలని కోరుతూ రాష్టప్రతికి తాను లేఖ రాశానన్నారు.