రాష్ట్రీయం

హైదరాబాద్‌లో కోల్‌మైన్ పిఎఫ్ రీజనల్ ఆఫీసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 15: కోల్‌మైన్ ప్రావిడెంట్ ఫండ్ (పిఎఫ్) రీజనల్ కార్యాలయాన్ని హైదారాబాద్‌లో ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. బుధవారం ఆయన ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ తెలంగాణ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాలకు సంబంధించిన ఈ రీజనల్ కార్యాలయాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. అలాగే దీంతో పాటుగా తెలంగాణలోని గోదావరిఖనిలో సబ్ రీజనల్ కార్యాలయం ఏర్పాటు చేస్తామన్నారు. సిఎంపీఎఫ్‌వో కార్యాలయాల ద్వారా బొగ్గు సంబంధిత సంస్థలలో పనిచేస్తున్న వారికి పెన్షన్లు సులభంగా అందుతున్నాయని వెల్లడించారు. పార్లమెంట్ సమావేశాల అనంతరం హైదరాబాద్‌లో కాంట్రాక్టు కార్మికుల సమస్యలపై చర్చలు జరుపుతామని వెల్లడించారు. రాజకీయ అపరిపక్వతకు నిదర్శంగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ బీజేపీపై చేసిన వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో పూర్తిగా కాంగ్రెస్ పార్టీని మైనారిటీలు, ముస్లింలు, ఎస్సీలు తిరస్కరించారని పేర్కొన్నారు. దక్షిణాది రాష్ట్రాలలో అధికారంలోకి రావడానికి కార్యకర్తలకు ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఉత్సాహాన్ని ఇచ్చాయని తెలిపారు.