రాష్ట్రీయం

వచ్చేసారీ విజయం మాదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మార్చి 20: రాష్ట్రంలో 2019లో జరిగే ఎన్నికల్లో తమదే విజయం తమదేనని, తానే మళ్లీ ముఖ్యమంత్రినవుతానని సి ఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలో శరవేగంగా అభివృద్ధి చేస్తున్న తమకే ఓట్లడిగే అధికారం ఉందని ఆయన అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమతుల్యంగా కొనసాగిస్తూ ప్రజల జీవన ప్రమాణాలు పెంచడంతో పాటు చరిత్రలో తెలుగుదేశం పార్టీయే నిలిచేలా నిర్మాణాత్మక కార్యక్రమాలు అమలు చేస్తామని చంద్రబాబు అన్నారు. సోమవారం శాసనసభలో రాష్ట్ర ప్రగతిపై రెండున్నర గంటలకు పైగా ఆయన సుదీర్ఘ ప్రసంగం చేశారు. పోలవరం, రాజధాని అమరావతి నిర్మాణమే తన జీవితాశయంగా చెప్పారు. ఈ రెండు తన కళ్లని చంద్రబాబు అభివర్ణించారు. రాష్ట్రంలోని అన్ని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేసి ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో వెనుకబాటుతనానికి కారణాలను గుర్తించి అభివృద్ధికి అనువైన ప్రణాళిక సిద్ధం చేస్తామన్నారు. వైఎస్ మాదిరిగా ఏ జాతీయ పార్టీ నేతల ఫోటోలనో అడ్డుపెట్టుకుని ఎన్టీఆర్ కానీ, తానుకానీ గెలవలేదన్నారు. కొత్తరాజధానిలో 9 కానె్సప్ట్ నగరాలు, 4, 6 లేన్ల రహదార్లు ఏర్పాటవుతాయని, ఇవికాక 186 కిలోమీటర్ల భారీ అవుటర్ రింగ్‌రోడ్డుతో 27 టౌన్‌షిప్‌లు నెలకొల్పుతామని చెప్పారు. పోలవరం భూసేకరణకు రూ.30 వేల కోట్ల వరకు ఖర్చవుతుందని, దీనిపై కేంద్రానికి నివేదిస్తామన్నారు. కట్టుబట్టలతో రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో ఎన్డీఏలో భాగస్వాములుగా అభివృద్ధికి అవసరమైన నిధులు సాధిస్తున్నట్లు వివరించారు. రాష్ట్రానికి వచ్చేదానిలో 10 రూపాయలు తక్కువైనా ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. ఏ రాష్ట్రంలోనూ అమలుచేయని విధంగా రైతు, డ్వాక్రా రుణమాఫీ చేశామన్నారు. భావితరాలకు ఆదర్శంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతామన్నారు. హంద్రీ-నీవా, గాలేరు-నగరి, గండికోట, వెలుగోడు, ఓర్వకల్లు, వెలిగొండ ప్రాజెక్టులను పూర్తిచేసి అన్ని ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తామని చెప్పారు. వెలిగొండ ప్రాజెక్టుకు 2018లోగా నీళ్లు చేరుస్తామన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తామన్నారు. ప్రజలకు ఆరోగ్యం, ఆహారం, ఉపాధి, భద్రతే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇందుకోసం 7మిషన్లు, 5గ్రిడ్లు, 5క్యాంపెయినింగ్ మోడ్‌లతో ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. ఇస్రో సహకారంతో ఉపగ్రహ వ్యవస్థ వినియోగంతో భూసారాన్ని గ్రహించి కరవును అధిగమించే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. ఉద్దానం తరహాలో రాష్ట్రంలో కిడ్నీ వ్యాధుల నియంత్రణకు ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేస్తామన్నారు. ప్రపంచ దేశాల్లోని పరిణామాలను ఆధ్యయనం చేసి నివారణకు చేపట్టాల్సిన చర్యలను పరిశీలిస్తామన్నారు. వచ్చే నెల 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా సిఎం ఆరోగ్య కేంద్రాలను అన్ని మునిసిపల్, పట్టణ కేంద్రాల్లో ప్రారంభిస్తామని వెల్లడించారు. విజయవాడ- చెన్నై, చెన్నై- బెంగుళూరు పారిశ్రామిక కారిడార్లతో పాటు తిరుపతి- నెల్లూరు-తడ- చెన్నైను ఇండస్ట్రియల్ జోన్ (సెజ్)గా ఏర్పాటు చేసేందుకు కేంద్రం పరిశీలిస్తోందని తెలిపారు. పోలవరం కాఫర్ డ్యాంను త్వరలో ప్రారంభిస్తామన్నారు. ఇప్పటివరకు 41 శాతం లైనింగ్ పూర్తయిందని చెప్పారు. కడప, పులివెందులకు నీరిచ్చిన విశ్వాసంతోనే ప్రజలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆదరించారని తెలిపారు. అభివృద్ధి చేస్తే ఓటడిగే హక్కు ఉంటుందని వచ్చే ఎన్నికల్లో పునర్వ్యవస్థీకరణ జరిగితే 225 సీట్లలో తమదే గెలుపని ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేశారు.

చిత్రం..సభలో నవ్వుతూ మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు