రాష్ట్రీయం

ఐఏఎస్ కొడుకే హంతకుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 20: ఐఏఎస్ అధికారి ఇంటి డ్రైవర్ నాగరాజు హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ హత్య కేసులో కీలక ఆధారాలు సేకరించి డ్రైవర్ నాగరాజును హత్య చేసింది ఐఏఎస్ అధికారి వెంకటేశ్వర్లు కొడుకేనని గుర్తించారు. యూసుఫ్‌గూడలోని సాయికళ్యాణ్ అపార్టుమెంట్‌లో ఈనెల 17న డ్రైవర్ నాగరాజు హత్యకు గురైన సంగతి తెలిసిందే. కాగా కారు డ్రైవర్ నాగరాజును హత్య చేసి మృతదేహాన్ని కొడుకు సాయిసుకృత్ తరలిస్తుండగా స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు సిసి టీవీ ఫుటేజీ పరిశీచలించగా కీలక ఆధారాలు లభించినట్టు పోలీసులు తెలిపారు. హత్య జరిగిన తరువాత ఐఏఎస్ అధికారి వెంకటేశ్వర్లు అపార్టుమెంట్‌కు వచ్చినట్టు పోలీసులకు ఆధారాలు లభించినట్టు తెలిసింది. హత్య జరిగిన విషయాన్ని దాచిపెట్టేందుకు వెంకటేశ్వర్లు, కుమారుడికి సహకరించినట్టు పోలీసులు భావిస్తున్నారు. తెలంగాణ వ్యవసాయ శాఖలో జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్న వెంకటేశ్వర్లు విషయమై పోలీసులు హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, సీఎస్‌కు సమాచారం అందించినట్టు ఓ పోలీస్ అధికారి వెల్లడించారు.
ఐఏఎస్ అధికారి హల్‌చల్
డ్రైవర్ నాగరాజు హత్య కేసులో ఐఏఎస్ అధికారి కొడుకు సాయిసుకృత్‌ను జూబ్లీహిల్స్ పోలీసులు ఆదివారం రాత్రి అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కేసు విచారణలో భాగంగా సోమవారం ఐఏఎస్ అధికారి వెంకటేశ్వర్లును జూబ్లీహిల్స్ పోలీసులు విచారణకు పిలిచారు. దీంతో ఆయన పోలీస్ స్టేషన్‌లో హల్‌చల్ చేశారు. తన వద్ద నుంచి తీసుకున్న సెల్‌ఫోన్ తనకు ఇవ్వాలని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తన ఫోన్ ఇచ్చినట్టయితే అక్కడి నుంచి వెళ్లిపోతానంటూ గొడవకు దిగారు. ఇదిలావుండగా అధికారి ఇంట్లో కారు డ్రైవర్‌గా పనిచేస్తున్న నాగరాజును ఆయన కుమారుడు యూసుఫ్‌గూడలోని సాయికల్యాణ్ అపార్టుమెంట్‌లో మద్యం తాగించి హత్య చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. అయితే హత్యకు గల కారణాల ఇంకా తెలియరాలేదని పోలీసులు చెబుతున్నారు.
కుటుంబ సభ్యుల ఆందోళన
డ్రైవర్ నాగరాజు హత్యోదంతంపై విచారణ జరుగుతుండగా మరోవైపు మృతుడి కుటుంబీకులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. హంతకులను కఠినంగా శిక్షించాలని, బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.