రాష్ట్రీయం

నీటి కోసం చెరువులో దీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, మార్చి 20: తమ గ్రామం పట్ల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని, నీరులేక అల్లాడుతున్నా స్పందించడంలేదంటూ ఓ రైతు గ్రామంలోని చెరువులోనే సోమవారం దీక్ష చేపట్టాడు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం బస్వాపురం గ్రామానికి చెందిన కొండల్‌రావు తమ గ్రామంలోని చెరువుకు నీరు విడుదల చేయడం లేదని, పంటలు ఎండిపోతున్నా స్పందించడం లేదని అధికారుల తీరుపై మండిపడ్డాడు. పశువులు కూడా నీటి కోసం అల్లాడుతున్నాయని, జిల్లాలోని కొంత ప్రాంతానికే నీరందేలా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈయనకు మరికొందరు కూడా మద్దతు పలికారు. నీరు విడుదల చేసేంతవరకు దీక్ష విరమించనని కొండల్‌రావు మొండికేశాడు. సమాచారం తెలుసుకున్న తహశీల్దార్ శ్రీనివాసరావు అక్కడకు చేరుకొని ఎనె్నస్పీ కాల్వ ద్వారా చెరువులోకి నీరు అందించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. ఈ నెలలోనే చెరువును నింపుతామని హామీ ఇచ్చి రైతు దీక్షను విరమింపజేశారు. జిల్లా కేంద్రం ఖమ్మంకు సమీపంలోని ఈ గ్రామంలో రైతు ఇలా దీక్ష చేయడం సంచలనం రేపింది. జిల్లావ్యాప్తంగా ఇది చర్చనీయాంశమైంది. అయితే, తహశీల్దార్ ఇచ్చిన హామీ ప్రకారం ఈ నెలాఖరులోగా నీరు విడుదల చేయకపోతే గ్రామస్తులందరినీ కలుపుకొని ఆందోళన చేస్తామని చెప్పారు.

చిత్రం..చెరువులో నిరసన దీక్షలో కూర్చున్న రైతు