రాష్ట్రీయం

బాలకృష్ణ చాలా మంచోడు: జగన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(బెంజిసర్కిల్), మర్చి 22: బాలకృష్ణ ఎంతో మంచోడు అంటూ..ప్రతిపక్షనేత వైఎస్ జగన్ కితాబిచ్చారు. అసెంబ్లీ లాబీల్లో బుధవారం ఎదురుపడిన తెదేపా ఎమ్మెల్యే కదిరి బాబూరావు, జగన్‌ల మధ్య సరదా సంభాషణ చోటు చేసుకుంది. తెదేపా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మంచోడని జగన్ కొనియాడడంతో నిజమే అని బాబూరావు సమాధానం చెప్పారు. ఇదే విషయంపై తనకు ఎదురుపడిన ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ వద్ద ప్రస్తావించిన బాబూరావు బాలకృష్ణ ఎవరినీ తిట్టరు, ఎటువంటి విమర్శలు చేయరని అన్నారు. అవును గతంలో బాలకృష్ణ అభిమాన సంఘం జిల్లా అధ్యక్షుడిగా జగన్ పనిచేశారని దాని అనుభవంతోనే అలా అన్నారని కేశవ్ అన్నారు. లాబీలో నుంచి సభలోనికి వెళ్తున్న సమయంలో వైఎస్ జగన్, టిడిపి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఒకరినొకరు పలకరించుకున్నారు. వాట్ ప్రభాకర్ అని పలకరించిన జగన్‌కు చెప్పండి సర్ అంటూ చింతమనేని పలకరించారు.
సిఎంకు మొహం చూపించలేకపోతున్నా: కెఇ
డిప్యూటీ సిఎం కెఈ కృష్ణమూర్తి లాబీల్లో ఎమ్మెల్యేలతో మాట్లాడుతూ కర్నూలు ఎన్నికల్లో అనుకున్న స్థాయిలో మెజారిటీ రాలేదని, దీని కారణంగానే సిఎం బాబుకు మొహం చూపించలేకపోతున్నానన్నారు. శిల్పా చక్రపాణి మరింత జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటేదని తెలిపిన ఆయన కర్నూలు కార్పొరేషన్ ఎన్నికల్లో సమన్వయంతో పని చేస్తామన్నారు. అలాగే డిప్యూటీ సిఎం ఛాంబర్‌లో కేఈని కలిసిన దేవినేనిల మధ్య అశక్తికర చర్చ జరిగింది. పత్తికొండ నియోజకవర్గంలోని కృష్ణగిరి మండలంలోని ఒక టిఎంసీ నీటి ప్రాజెక్టుకు తన తండ్రి కెఈ మాదన్న పేరు పెట్టాలన్న ప్రతిపాదన ఏమైందంటూ దేవినేనిని కెఈ ప్రశ్నించారు. లేఖ ఇస్తే వెంటనే ఆ ప్రాజెక్టుకు పేరు పెట్టే ప్రక్రియ ప్రారంభిస్తామని దేవినేని హామీ ఇచ్చారు. అసెంబ్లీని బుధవారం సందర్శించిన మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి లాబీల్లో అందరితో కలసి మాట్లాడుతూ అసెంబ్లీని చక్కటి వాస్తుతో అత్యాధునికంగా బాబు కట్టాంచారని కొనియాడారు. కానీ రెండు సభల్లోనూ తనకు చోటు లేకుండా పోయిందని అమె అవేదన వ్యక్తం చేశారు. ఇదే సందర్భంలో అటుగా వచ్చిన మంత్రి యనమల మీకిక్కడేం పనంటూ నన్నపనేనితో చమత్కరించారు. దీనిపై స్పందించిన ఆమె నోరున్న వాళ్లు సభలో ఉంటే బాగుండేదని బదులిచ్చారు. మంత్రులు గంటా, ప్రత్తిపాటి, దేవినేని, ఎమ్మెల్సీ కేశవ్‌ల మధ్య సరదా సంభాషణ గంటా కేంద్రంగానే జరిగింది. వైఎస్ కుటుంబంపై గంటా పగబట్టారని, గంటాపై ప్రత్తిపాటి పగబట్టారని సరదాగా కేశవ్ వ్యాఖ్యానించగా, వైఎస్ కుటుంబంపై రాష్ట్ర ప్రజలే పగతో ఉన్నారని దేవినేని ఉన్నారు. ఈ వ్యాఖ్యలపై వెంటనే స్పందించిన గంటా తనదైన శైలిలో ఎవరు ఎవరుపై పగబట్టారనేది తేల్చాల్సింది కేశవేనని బదులిచ్చారు. రాష్ట్రంలో మద్యం సిండికేట్లు రెచ్చి పోతున్నారని దీనిపై సిఎం బాబుకు ఫిర్యాదు చేసినట్లు ఎమ్మెల్యే సోము వీర్రాజు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల వద్ద ప్రస్తావించారు. అసెంబ్లీ స్పీకర్ తనపై చేసిన వాఖ్యలపై లాబీలో మాట్లాడిన చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు స్పీకర్‌తో మాకేమన్నా వ్యక్తిగత విరోధం ఉందా అన్నారు.