రాష్ట్రీయం

మెస్ చార్జీల పెంపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 24: తెలంగాణ ఆవిర్భావం తరువాత మొదటిసారి మెస్ చార్జీలు పెంచుతున్నట్టు సిఎం కె చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన ఒకటి రెండు రోజుల్లో వెలువడనున్నట్టు తెలిపారు. ప్రస్తుతం ఒక్కో విద్యార్థికి మెస్ చార్జీ రూ.650 చెల్లిస్తుండగా, దీన్ని రూ.1000 నుంచి రూ.1100కు పెంచబోతున్నట్టు వెల్లడించారు. మెస్ చార్జీలు ఎంతమేరకు పెంచవచ్చో ప్రతిపాదించాలని ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ను ఆదేశించామన్నారు. వారినుంచి ప్రతిపాదన అందిన వెంటనే ఒకటి రోజుల్లో తానే చార్జీలు పెంచే ప్రకటనను చేయనున్నట్టు సిఎం వెల్లడించారు. శాసనసభలో శుక్రవారం సంక్షేమ పద్దులపై చర్చ ముగింపు సందర్భంగా తెదేపా సభ్యుడు ఆర్ కృష్ణయ్య ఈ అంశాన్ని ప్రస్తావించగా, ముఖ్యమంత్రి స్పందించి ఈమేరకు ప్రకటన చేశారు. మెస్ చార్జీలు పెంచాలని తాము ఇదివరకే నిర్ణయించామని, ఎంతమేరకు పెంచాలో కసరత్తు చేసి ప్రతిపాదన ఇవ్వాల్సిందిగా సంబంధిత మంత్రులు, అధికారులను ఆదేశించినట్టు చెప్పారు. ఫీజు రియింబర్స్‌మెంట్ బకాయిల చెల్లింపులో జరుగుతున్న జాప్యాన్ని కాంగ్రెస్ సభ్యులు ప్రస్తావించడంపై సిఎం కెసిఆర్ ప్రతిస్పందించారు. పథకాన్ని తమ ప్రభుత్వం ప్రవేశపెట్టకపోయినా కాంగ్రెస్ హయాంలో ఏవిధంగా అమలు చేశారో అలాగే అమలు చేస్తున్నామని వెల్లడించారు. అయితే, విద్యా సంవత్సరం ముగిసిన తరువాతే ఫీజు రీయింబర్స్‌మెంట్ మొత్తం ఆయా కళాశాలలకు చెల్లిస్తామన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల కాని కారణంగా ఎక్కడైనా విద్యార్థులకు సర్ట్ఫికెట్లు నిలిపివేసినట్టు తమకు సమాచారం అందితే, సదరు విద్యాసంస్థల గుర్తింపు రద్దు చేస్తామని ముఖ్యమంత్రి హెచ్చరించారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఈబిసి వర్గాలకు చెందిన విద్యార్థుల విదేశీ విద్యకు అమలు చేస్తున్న ఓవర్సీస్ స్కాలర్ షిప్‌కు పరిమితి లేదని, దరఖాస్తు చేసిన వారిలో ఎంతమంది అర్హులుంటే అందరికీ దీన్ని వర్తింప చేస్తామని కూడా సిఎం ప్రకటించారు. ఓవర్సీస్ స్కాలర్ షిప్ పథకం కింద 300మంది బీసీ విద్యార్థుల నుంచి దరఖాస్తులు అందగా, అందులో ఇప్పటికే 136 దరఖాస్తులను క్లియర్ చేశామన్నారు. స్కాలర్‌షిప్స్ మంజురైన విద్యార్థుల జాబితా కాన్స్‌లేట్ కార్యాలయానికి సకాలంలో చేరకపోవడం వల్ల వీసాలు రిజెక్టు అయిన విషయాన్ని సభ దృష్టికి కాంగ్రెస్ సభ్యుడు వంశీచంద్‌రెడ్డి తీసుకురాగా, ముఖ్యమంత్రి స్పందిస్తూ కొత్త పథకం కావడంతో కొంత కమ్యూనికేషన్ గ్యాప్, సాంకేతిక కారణాలవల్ల ఇబ్బంది జరిగిందన్నారు. వారందరికీ న్యాయం చేస్తామని, ఎంపికైన అభ్యర్థులు అందరినీ తప్పనిసరిగా విదేశీ చదువులకు పంపుతామంటూ, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు. మెస్ చార్జీలను పెంచడంతోపాటు కొత్తగా 24 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయబోతున్నట్టు ప్రకటించారు. ఈ ఏడాది 16వేల పోస్టులు భర్తీచేసి, వచ్చే ఏడాది మరో ఎనిమిది వేల పోస్టులు భర్తీ చేయనున్నట్టు సిఎం వివరించారు. స్టడీ సర్కిల్స్‌కు బడ్జెట్‌లో ఎలాంటి కోత పెట్టలేదన్నారు. ఒక్కో విద్యార్థికి రూ. 1.2లక్షల చొప్పున వ్యయంతో అత్యద్భుతంగా గురుకుల విద్యాసంస్థలను ఏర్పాటు చేస్తున్నామన్నారు.