రాష్ట్రీయం

గద్వాల సంబురాలు ఆరంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గద్వాల, మార్చి 25: నడిగడ్డ సంస్కృతి, సంప్రదాయాలను ఎలుగెత్తి చాటేలా నిర్వహిస్తున్న గద్వాల సంబురాలు శనివారం సాయంత్రం అట్టహాసంగా ఆరంభమయ్యాయి. గత పది రోజులుగా జిల్లా యంత్రాంగం అహర్నిశలు కృషి చేసి సంబురాల వేడుకలకు సర్వం సిద్ధం చేశారు. సాయంత్రం 5 గంటల సమయంలో జిల్లా నలుమూలల నుండి వచ్చిన కళాకారులు రాజీవ్ చౌరస్తాకు చేరుకొని తమ నృత్యాలు, ఆటపాటలు, డప్పుల మోతలతో సంబరాన్ని అంబరాన్నంటేలా చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మార్కెట్ యార్డు చైర్‌పర్సన్ బండ్ల లక్ష్మిదేవి హాజరై జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. వివిధ పాఠశాలలు, కళాకారులు నృత్యాలు చేసుకుంటూ మార్కెట్ యార్డు వెనుక భాగంలో ఉన్న సభావేదిక వద్దకు చేరుకున్నారు. బాలభవన్ విద్యార్థులు, గాయకుడు మేడికొండ ప్రసాద్ స్వాగత గీతాలతో ఆహుతులను అలరించారు. ఈ సందర్భంగా గద్వాల సంబురాలు ప్రారంభిస్తున్న మార్కెట్ యార్డు చైర్మన్ లక్ష్మిదేవి ప్రారంభ ఉపన్యాసం చేశారు. అనంతరం జ్యోతిప్రజ్వలనలో కలెక్టర్ రజత్‌కుమార్‌సైనీ, ఎస్పీ విజయ్‌కుమార్, జెసి డాక్టర్ సంగీత, 10వ పటాలం కమాండెంట్ సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ కళాకారులు తమ ఆటపాటలతో అందరినీ ఆకట్టుకున్నారు. మొదటి రోజు పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావడంతో అధికారులు మరింత ఉత్సాహంగా సంబురాలను కొనసాగించారు. పాఠశాలల విద్యార్థులు, జిల్లాకు చెందిన సాంస్కృతిక కళాకారులు, మిమిక్రీ ఆర్టిస్టులు, మెజిషీయన్ శంకర్ బృందం, బాలభవన్ విద్యార్థినుల నృత్యాలు అందర్నీ అబ్బురపర్చాయి.

చిత్రం,,, జ్యోతి ప్రజ్వలన చేస్తున్న కలెక్టర్ రజత్‌కుమార్‌సైనీ.
చిత్రంలో మార్కెట్ యార్డు చైర్మన్
బండ్ల లక్ష్మిదేవి తదితరులు