రాష్ట్రీయం

ఇద్దరు నర్సులపై వేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 26: గాంధీ దవాఖానలో చిన్నారులకు గడువు ముగిసిన ఇంజెక్షన్లు ఇచ్చారన్న ఆరోపణలపై వైద్య మంత్రి ఆదేశాల మేరకు విచారణ జరిపిన డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ (డిఎంఇ) డాక్టర్ రమణి ఒక పిజి వైద్యుడికి మెమో ఇస్తూ, ఇద్దరు స్ట్ఫా నర్సులను సస్పెండ్ చేసింది. వైద్యమంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి ఆదేశాల మేరకు రమణి ఉన్నతస్థాయి విచారణ నిర్వహించారు. గాంధీ దవాఖానకు వెళ్లి పరిస్థితి సమీక్షించారు. గడువు ముగిసిన ఇంజెక్షన్లు ఇచ్చారని ఆరోపణలు వచ్చిన రోజు విధి నిర్వహణలో ఉన్న పిజి డాక్టర్ నవీన్‌సింగ్‌కు మెమో జారీ చేశారు. స్ట్ఫా నర్సులు శోభ, సునీతలను సస్పెండ్ చేశారు. గాంధీ ఆసుపత్రికి సంబంధం లేని నిపుణులైన ఇద్దరు డాక్టర్లతో ఎక్స్‌టర్నల్ ఎంక్వయిరీ కమిటీని వేశారు. రెండురోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ఆమె సూచించారు. నివేదిక వచ్చిన తర్వాత బాధ్యులని తేలిన వారిపై చర్య తీసుకుంటామని డాక్టర్ రమణి ప్రకటించారు. శనివారం రాత్రి చిన్నపిల్లల వార్డులో దాదాపు 15మందికి ఇంజక్షన్లు ఇచ్చారు. వాటిలో కొన్ని కాలం చెల్లినవి కావడంతో అవి వికటించి కొందరు పిల్లలు వాంతులు, విరేచనాలతో బాధపడ్డారు. వారిని వెంటనే అత్యవసర విభాగానికి తరలించి చికిత్స అందించారు. ఇందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నప్పటికి చికిత్స చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఇందుకు ప్రధాన కారణం కాలం చెల్లిన మందులు ఇవ్వడమేనంటూ పిల్లల తల్లిదండ్రులు ఇంజక్షన్ బాటిల్స్‌ను చూపించారు. కాగా తమ తప్పు పదిమందికీ తెలియకుండా ఉండేందుకు సిబ్బంది ఆస్పత్రిలోని అన్ని చెత్తబుట్టలనూ శుభ్రం చేసి, ఇంజక్షన్ బాటిళ్ల ఆనవాలు కూడా లేకుండా చేశారని వారు ఆరోపిస్తున్నారు. తాము వైద్యం కోసం వచ్చామని, ఆసుపత్రిని అభాసుపాలు చేయాల్సిన అవసరం తమకేంటని వారు ప్రశ్నిస్తున్నారు. ఇదిలాఉండగా ఆదివారం డిఎంఇ రమణితోపాటు ఆసుపత్రికి కొత్తగా వచ్చిన సూపరింటెండెంట్ డాక్టర్ శ్రావణ్‌కుమార్ విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఇది కావాలని ఎవరో ఆసుపత్రిని అభాసుపాలు చేయడానికి పన్నుతున్న కుట్రగా పేర్కొనడం విశేషం. ఏదైనా ఇంజక్షన్ ఇచ్చినప్పుడు చలి రావడం సహజమేనని, అది వెంటనే వైద్యులు గుర్తించి చర్యలు తీసుకుంటారని, అంతమాత్రానికే కాలం చెల్లిన మందులు ఇచ్చామని చెప్పడం సరికాదని, దీనిపై ఇద్దరు ప్రొఫెసర్లతో విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు.

చిత్రాలు....గాంధీ ఆస్పత్రిలో కోలుకుంటున్న బాలలు.. మందులు తనిఖీ చేస్తున్న వైద్యుడు