రాష్ట్రీయం

ఉత్సవాల్ని విజయవంతం చేద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, మార్చి 26: శ్రీరామనవమి రోజు వివిఐపీలు, విఐపీల పర్యటన, కల్యాణ మండపంలోకి వారు వచ్చే సమయ సమాచారాన్ని ముందుగానే తీసుకోవాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల నిర్వహణపై ఆదివారం ఆయన చిత్రకూట మండపంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. భేషజాలకు పోకుండా ఐక్యంగా అందరం కలిసి పనిచేసి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేద్దామని తుమ్మల పిలుపునిచ్చారు. కల్యాణ మండపం వద్ద మాడ వీధుల్లో తిరగడానికి స్థలం తక్కువగా ఉన్నందున వివిఐపీలు, విఐపీల వాహనాలను వారు బసచేసిన గదుల వద్దనే ఉంచి, పోలీసులు ఏర్పాటు చేసిన వాహనాల్లో కల్యాణ మండపానికి నిర్ణీత సమయానికి తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ అంబర్ కిషోర్ ఝా, ఏఎస్పీ సునీల్‌దత్, డిఎస్పీ అశోక్‌కుమార్‌లకు సూచించారు. నవమి రోజు భక్తులందరికీ పానకం, వడపప్పు పంపిణీ చేసేలా చర్యలు తీసుకున్నట్లు దేవస్థానం ఈవో తాళ్లూరి రమేష్‌బాబు వివరించారు. అయితే ఈ సందర్భంలో తొక్కిసలాటలకు తావులేకుండా చూడాలని మంత్రి తుమ్మల సూచించారు. ఈసారి గత లోపాలను సరిదిద్దుకుంటూ జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు పర్యవేక్షణలో పనులు ముందుగానే మొదలుపెట్టి పూర్తిచేయడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. భద్రాచలంలో ఎలాంటి సౌకర్యాలు భక్తులకు కల్పిస్తున్నారో అవే పర్ణశాలలోనూ ఉండాలని ఈవో రమేష్‌బాబును ఆదేశించారు. స్వామివారి కల్యాణ తలంబ్రాల విషయంలో భక్తులు అసంతృప్తికి గురికాకుండా సాధ్యమైనన్ని కౌంటర్లు ఎక్కువగా ఏర్పాటు చేసి అందించాలని మంత్రి తుమ్మల ఆదేశించారు. సమీక్ష సమావేశానికి పంచాయతీరాజ్ శాఖ ఎస్‌ఇ, ఇఇ గైర్హాజరు కావడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

చిత్రం..భద్రాద్రిలో శ్రీరామ నవమి ఉత్సవాల ఏర్పాట్లు పరిశీలిస్తున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు