రాష్ట్రీయం

జాగ్రత్తగా వ్యవహరించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 27: కేసుల విచారణ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని ఎపి అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌ను ఉమ్మడి హైకోర్టు హెచ్చరిక జారీ చేసింది. వ్యక్తిగత కేసుల విషయంలోనూ, వారి విన్నపాలు విషయంలోనూ, మధ్యంతర ఉత్తర్వుల్లో సమతుల్యతను పాటించాలని కూడా హైకోర్టు పేర్కొంది. వైఎస్‌ఆర్ కడప జిల్లాలో వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ పి భువనేశ్వరి దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన జస్టిస్ పివి సంజయ్ కుమార్ , జస్టిస్ అనిస్‌లతో కూడిన డివిజన్ బెంచ్ ఈ వ్యాఖ్యలను చేసింది. పాఠశాల జారీ చేసిన ఏడో తరగతి మార్కుల జాబితాను విశ్వసించలేమని పేర్కొంటూ ఆఫీసు సబార్డినేట్ ఉద్యోగానికి చేసిన దరఖాస్తును తిరస్కరించారని ఆమె ఆరోపించింది. ఈ విషయంలో తాను ఎపిఎటిని ఆశ్రయించానని, అయితే ఎలాంటి మధ్యంతర ఉత్తర్వు ఇవ్వలేదని, కనీసం తన రికార్డులు సవ్యమైనవో లేదో కూడా పరిశీలన జరిపించలేదని, పాఠశాల రికార్డులను కూడా తెప్పించుకోలేదని ఆమె పిటిషన్‌లో వాదించింది. పాఠశాల రికార్డులను సవ్యంగా నిర్వహిస్తోందా లేదా అన్నది పిటిషనర్‌కు సంబంధించిన అంశం కాదని, ఆ వ్యవహారాలను చూసుకోవల్సింది ఆ శాఖ అధికారులేనని, తాను ఏడో తరగతి చదివినట్టు ఇచ్చిన ధృవీకరణ సరైందో లేదో చూడాలే తప్ప రికార్డులు లేవనే సాకు చెప్పడానికి వీలు లేదని హైకోర్టు అభిప్రాయపడింది. ఇలాంటి కేసుల్లో ట్రిబ్యునల్ మరింత జాగరూకతతో వ్యవహరించాల్సి ఉందని హైకోర్టు పేర్కొంది.