రాష్ట్రీయం

తెలుగు రాష్ట్రాలకు మంచికాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 27: హేమలంబ సంవత్సరం ఇటు తెలంగాణకు, అటు ఆంధ్రప్రదేశ్‌కు శుభసూచకంగా ఉంటుందని విశ్వయోగి విశ్వంజీ పేర్కొన్నారు. సోమవారం ఇక్కడ ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ, కొత్త సంవత్సరంలో తెలుగు ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని, ప్రజలందరికీ ఆశీస్సులు అందిస్తున్నానని తెలిపారు. ఈ సంవత్సరం కుజుడు రాజుగా ఉంటాడని, మంత్రిగా గురుడు ఉంటాడని, సస్యాధిపతిగా రవి ఉంటారన్నారు.
ఈ కారణాలవల్ల రెండు రాష్ట్రాల్లో వర్షాలు బాగా ఉంటాయని, పంటలు సమృద్ధిగా పండుతాయని తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో వేగంగా ముందుకు వెళతాయన్నారు. అమెరికాతో సహా విదేశాల్లో నివసిస్తున్న తెలుగు ప్రజలంతా సొంత రాష్ట్ర అభివృద్ధికోసం సహకరించాలన్నారు. ఈ సంవత్సరం భారతదేశ కీర్తిప్రతిష్ఠలు అంతర్జాతీయంగా మరింత ఇనుమడిస్తాయని, ప్రపంచంలో భారత్ కీలకభూమిక పోషిస్తుందని వెల్లడించారు.
అంతర్గతంగా కొన్ని ఇబ్బందులు వచ్చినా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమర్థతగా ఎదుర్కొంటాయని, శాంతి స్థాపనకు అవసరమైన చర్యలు తీసుకుంటాయన్నారు.