రాష్ట్రీయం

సిబిఐ విచారణ జరపాలి : జగన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మార్చి 28: హిందూపూర్ నారాయణ విద్యాసంస్థల్లో టెన్త్ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం ప్రత్యక్షంగా బయటపడినా, ఆ విద్యాసంస్థల యాజమాన్యాన్ని రక్షించే ప్రయత్నాలు ప్రభుత్వం చేస్తోందని ప్రతిపక్ష నేత జగన్ దుయ్యబట్టారు. అడ్డగోలుగా ఆయనకు మంత్రి పదవి కట్టబెట్టటం వెనుక చంద్రబాబు బినామీల బాగోతం ఉన్నట్టు అర్థమవుతోందని జగన్ ధ్వజమెత్తారు. ప్రశ్నపత్రాల లీకేజీపై శాసనసభ నుంచి వాకౌట్ చేసిన అనంతరం వైఎస్సార్ సిఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ విషయంలో తప్పు జరిగిందని విద్యాశాఖ ఉన్నతాధికారులు అంగీకరిస్తుంటే, సభలో చర్చకు అనుమతించక పోవటం దారుణమన్నారు. పరీక్షల చీఫ్ సూపర్నెంటే స్వయంగా వివరణ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. అటెండర్ సెల్‌ఫోన్ వాట్సప్ నుంచి ప్రశ్నపత్రం లీకైందని, ఇన్విజిలేటర్ బాధ్యుడని కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ వ్యవహారంలో తిమింగలాలను తప్పించి చిన్నచేపల్ని ఎరగా వేసే ప్రయత్నాలు ప్రభుత్వపరంగా జరుగుతున్నాయని విమర్శించారు. తెలుగు, హిందీ, సైన్స్ పత్రాలు లీకయ్యాయని గుర్తించారని, ఈ మొత్తం వ్యవహారంపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. విద్యావ్యవస్థను దారుణంగా దిగజార్చుతున్నారని, మొదటి వంద ర్యాంకులు నారాయణ విద్యాసంస్థలకే దక్కేలా విద్యా వ్యవస్థను భ్రష్టుపట్టించారన్నారు. దీనివల్ల ప్రతిభ కలిగిన విద్యార్థులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. గతంలో ప్రశ్నపత్రాల లీకేజీ ఆరోపణలు వచ్చిన వెంటనే సంబంధిత మంత్రులు రాజీనామా చేసేవారని, ప్రస్తుతం సిఎం చంద్రబాబు మాత్రం మంత్రులను వెనకేసుకొస్తున్నారని ఆక్షేపించారు. పుష్కరాల నిధుల గోల్‌మాల్ బాగోతంపై రిటైర్డు జడ్జితో విచారణ జరిపి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. అగ్రిగోల్డ్ ఆస్తులపై కనే్నసిన సిఎం, మంత్రులు కేసును నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. సామాన్య, మధ్యతరగతి రైతులకు మేలుచేసే విధంగా యూపీఏ ప్రభుత్వం రూపొందించిన 2013 భూసేకరణ చట్టానికి తూట్లు పొడుస్తున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధివుంటే 5 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడకుండా సిబిఐ విచారణ జరపాలని జగన్ డిమాండ్ చేశారు.