రాష్ట్రీయం

కేశినేని బస్సుల నిలిపివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), మార్చి 31: రవాణారంగంలో కీలకంగా వ్యవహరిస్తున్న కేశినేని ట్రావెల్స్ అధినేత, విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శ్రీనివాస్ (నానీ) ఇప్పుడు వారసత్వంగా వస్తున్న తన వ్యాపారాల నుంచి తప్పుకోనున్నారు. దీంతో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పరుగులు పెడుతున్న కేశినేని బస్సులకు బ్రేక్ పడింది. ఇక బస్సులు తిప్పనని నానీ ప్రకటించారు. ఇదే విషయాన్ని మీడియా ద్వారా వెల్లడించాలని ప్రయత్నించి ముఖ్యమంత్రి పిలుపు మేరకు వెళ్లి, ఆయనను కలిసి వచ్చిన అనంతరం కూడా తన నిర్ణయంలో మార్పు లేదని ప్రకటించారు. ఆయన అదే పట్టుతో ఉన్నారు. మొత్తం మీద ఇటీవల రవాణాశాఖ కమిషనర్‌తో జరిగిన వివాదాన్ని పురస్కరించుకుని కేశినేని నాని తన వ్యాపారాన్ని పణంగా పెడుతూ సంచలన నిర్ణయం తీసుకోవడంతో శుక్రవారం నగరంలో హైడ్రామా చోటు చేసుకుంది. ప్రస్తుతం 16రాష్ట్రాల్లో 150 బస్సులు కేశినేని ట్రావెల్స్ నుంచి తిరుగుతున్నాయి. 30ఏళ్ల రవాణా రంగంలో అనుభవం గడించిన కేశినేని ట్రావెల్స్‌లో ఐదువేల మంది ఉపాధి పొందుతున్నారు. ప్రైవేటు రవాణా రంగంలో ఆన్‌లైన్ బుకింగ్ విధానం తొలిసారిగా కేశినేని ట్రావెల్స్ ప్రవేశపెట్టింది. అయితే.. ప్రైవేటు ట్రావెల్స్ రంగంలో ఆధిపత్య పోరు నడుస్తున్న క్రమంలో కేశినేని ట్రావెల్స్‌కు ఇతర ట్రావెల్స్‌కు మధ్య కోల్డ్‌వార్ కొనసాగుతోంది. ఈక్రమంలో గతంలో ఆరెంజ్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు ప్రమాదంలో విజయవాడలో ఒకరు మృతి చెందగా.. ఘటనపై కేసు నమోదైంది. అయితే రవాణాశాఖ ఆరెంజ్ ట్రావెల్స్ బస్సుకు సంబంధించి ఇవ్వాల్సిన నివేదికలో మార్పులు చేయాల్సిందిగా కేశినేని నాని అనుచరులు ఒత్తిడి తీసుకువచ్చారన్న నేపథ్యంలో రవాణాశాఖకు, కేశినేని మధ్య వివాదం తలెత్తింది. దీంతో ఇటీవల కమిషనర్ బాల సుబ్రహ్మణ్యంతో ఎంపి కేశినేని నాని, ఎమ్మెల్యే బొండా ఉమా, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, తదితరులు గొడవకు దిగిన ఉదంతం రాష్ట్రంలో కలకలం రేకెత్తించిన విషయం తెలిసిందే. అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు, రవాణాశాఖ ఉద్యోగులకు మధ్య అంతరం చోటు చేసుకోకుండా ముందే మేల్కొన్న ముఖ్యమంత్రి సూచనతో నానీ నేరుగా కమిషనర్ వద్దకు వెళ్లి ‘సారీ’ చెప్పాల్సి వచ్చింది. అదే ఇప్పుడు కేశినేని బస్సుల నిలిపివేత నిర్ణయానికి కారణమైనట్లు తెలుస్తోంది.