రాష్ట్రీయం

భద్రాద్రి బ్రహ్మోత్సవాలకు ఘనంగా అంకురార్పణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, ఏప్రిల్ 1: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలకు శనివారం అంకురార్పణ జరిగింది. ఉదయం గర్భగుడి నుంచి ఉత్సవమూర్తులను ఊరేగింపుగా ప్రాకార మండపానికి తీసుకొచ్చారు. గోదావరి నుంచి తెచ్చిన తీర్థబిందెతో ప్రాకార మండపంలో ఉత్సవాంగ స్నపన తిరుమంజనం జరిగింది. ముందుగా సమస్త నదీజలాలు, పంచామృతాలతో అభిషేకం చేశాక మంజీరాలతో తిరుమంజనం జరిగింది. ఈ సందర్భంగా మూలవరుల వద్దకు బ్రహ్మోత్సవాలు నిర్వహించే రుత్విక్కులు మేళతాళాలతో వెళ్లి ఉత్సవ అనుజ్ఞ తీసుకున్నారు. తర్వాత దేవస్థానం ఈఓ తాళ్లూరి రమేశ్‌బాబు బ్రహ్మోత్సవాలు నిర్వహించే రుత్విక్కులకు దీక్షా వస్త్రాలను అందించారు. సాయంత్రం గోవిందరాజస్వామి ఆలయం నుంచి పుట్ట మన్ను తెచ్చి యాగశాలలో అంకురార్పణ చేశారు. నవధాన్యాలను, నవకలశాలను స్థాపించి, దేవతామూర్తులను ఆవాహన చేసి, అఖండ దీపాన్ని వెలిగించి పాళికల్లో అంకురాలను ఉంచి, తీర్థజలాలు చల్లారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను ఆవాహన చేశారు. బలిహరణం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి తీర్థప్రసాదాలు స్వీకరించారు.

చిత్రం..తిరుమంజనం చేస్తున్న అర్చకులు