రాష్ట్రీయం

కొలువుదీరిన కొత్త మంత్రులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 2: కొత్త మంత్రులు కొలువుదీరారు. వెలగపూడి సచివాలయాన్ని ఆనుకొని ఉన్న ఖాళీ స్థలంలో ఏర్పాటుచేసిన మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవం ఆదివారం అట్టహాసంగా జరిగింది. గవర్నర్ నరసింహన్ కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. తొలుత ఎచ్చెర్ల ఎమ్మెల్యే కిమిడి కళావెంకట్రావు, ఎమ్మెల్సీ నారా లోకేష్ ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు, ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి, ఎమ్మెల్యే ఆర్వీ సుజయకృష్ణ రంగారావు, రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, కొవ్వూరు ఎమ్మెల్యే కొత్తపల్లి శామ్యూల్ జవహర్, పలమనేరు ఎమ్మెల్యే ఎన్ అమరనాథ్‌రెడ్డి, చివరగా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ప్రమాణస్వీకారం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రులు కెఇ కృష్ణమూర్తి, చినరాజప్ప, మంత్రులు యనమల రామకృష్ణుడు, దేవినేని ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు, అతిథులు పాల్గొన్నారు. హైటీ అనంతరం గవర్నర్‌తో కొత్త మంత్రివర్గ సభ్యులు ఫొటోలు దిగారు.
లోకేష్ పాదాభివందనం
మంత్రిగా ప్రమాణస్వీకారం చేశాక తన తండ్రి చంద్రబాబుకు, గవర్నర్ నరసింహన్‌కు లోకేష్ పాదాభివందనం చేశారు. ఆనందబాబు, జవహర్ కూడా చంద్రబాబు పాదాలకు నమస్కరించారు. ప్రమాణస్వీకారం చేసే సమయంలో లోకేష్, అఖిలప్రియ, సుజయకృష్ణ రంగారావు కాస్త తడబాటుకు గురయ్యారు. మంత్రివర్గంలో తండ్రీకొడుకులు ఉండటం ఒక రికార్డు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తుండగా, ఆయన మంత్రివర్గంలో కుమారుడు లోకేష్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించటం రాష్ట్ర రాజకీయ చరిత్రలో రికార్డుగా నమోదయింది. మంత్రివర్గం నుంచి ఉద్వాసనకు గురైన బొజ్జల, పల్లె రఘునాథరెడ్డి, కిమిడి మృణాళిని, రావెల కిషోర్ గైర్హాజరయ్యారు. అయితే పీతల సుజాత మాత్రం హాజరై, మంత్రివర్గంలో చోటు సంపాదించిన తన జిల్లా నేతలు జవహర్, పితాని సత్యనారాయణలను స్వయంగా అభినందించారు. వైకాపా నేతలెవరూ ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. లోకేష్ ప్రమాణ స్వీకారం చూసేందుకు బాలకృష్ణ సతీసమేతంగా హాజరయ్యారు. లోకేష్ భార్య బ్రాహ్మణి, తల్లి భువనేశ్వరి, సినీ హీరో నారా రోహిత్ కూడా వచ్చారు.

చిత్రాలు.. గవర్నర్ నరసింహన్‌కు పాదాభివందనం చేస్తున్న నారా లోకేష్
*మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న అఖిలప్రియ