రాష్ట్రీయం

పార్టీ మారితే పదవులు రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 3: పార్టీమారిన వారి పదవులు రద్దు కావల్సిందేనని కేంద్ర పట్టణాభివృద్ధి, సమాచార ప్రసార మంత్రి వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. దీనికోసం అవసరమైతే కొత్తచట్టం తేవాల్సిందేనని అన్నారు. 2019లో తెలంగాణలో బిజెపి ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆయన వెల్లడించారు. మత రిజర్వేషన్లకు బిజెపి వ్యతిరేకమని, కాంగ్రెస్ సింగిల్‌మెన్ ఎంటర్‌ప్రైజెస్‌గా మారిందని వ్యాఖ్యానించారు. సోమవారం సాయంత్రం ఆయన నివాస గృహంలో మీడియాతో మాట్లాడుతూ దేశంలో రాజకీయాలు, ప్రధాని సంక్షేమ పథకాలను ఆయన సుదీర్ఘంగా వివరించారు. బిజెపి ఐదు రాష్ట్రాల్లో చారిత్రాత్మక విజయాన్ని సాధించిందని, స్థిరమైన ప్రభుత్వానికి ఓటు వేస్తే అభివృద్ధి పథంలో మరింత ముందుకెళ్లేందుకు ఎలా దోహదం చేస్తుందో ప్రధాని రుజువు చేశారన్నారు. రెండున్నరేళ్లలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలకు తమ ఆమోదం ఉందని ప్రజలు రుజువు చేశారన్నారు. అసలు సిసలు జాతీయ పార్టీగా నేడు బిజెపి అవిర్భవించిందన్నారు. 352మంది ఎంపీలు, 1380 మంది ఎమ్మెల్యేలు ఉన్నారన్నారు. 15 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నామని, భౌగోళికంగా 69 శాతం దేశం బిజెపి అధికారంలో ఉందన్నారు. 59 శాతం ప్రజాబాహుళ్యం బిజెపికి ఓటు చేశారని, ఎన్నికల సందర్భంగా ఎన్నిరకాల అపవాదులు చేసినా, అపవిత్ర కలయికలు బిజెపిని అడ్డుకోలేక పోయాయన్నారు. బహిరంగంగా అనేక పార్టీలు మతపరమైన ఓట్లుకోరినా వారి ఆకాంక్ష నెరవేరలేదన్నారు. దేశంలో ఆరోవంతు జనాభా యుపీలో ఉందని, అలాంటి రాష్ట్రంలో బిజెపికి అనుకూలంగా ప్రజలు తీర్పు ఇచ్చారని గుర్తు చేశారు. అభివృద్ధి ప్రధాన అంశంగా యుపీలో గెలిచిందన్నారు. అన్ని రాష్ట్రాల్లో ఓటింగ్‌లో అందరికన్నా ముందుందని తెలిపారు. విశ్వసనీయ పార్టీగా బిజెపితో చేతులు కలపడంతో మణిపూర్, గోవాల్లో తమ ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయని వివరించారు. ఎన్నికల్లో 690 సీట్లకు ఎన్నికలు జరిగితే 406 సీట్లు వచ్చాయని, మిత్రపక్షాలకు 13 సీట్లు వచ్చాయని, ఈ గణాంకాలే బిజెపికి పెరిగిన ఆదరణ తెలుస్తోందన్నారు. నోట్ల రద్దు తర్వాత ప్రజలు కోపంగా ఉన్నారని, బిజెపికి గుణపాఠం చేప్తారని రకరకాల శాపనార్ధాలు పెట్టినా అవేవి నెరవేరలేదని అన్నారు. దేశంలో అత్యంత పేదరికంలో ఉన్న యుపిలో ఉత్తరాంచల్‌లో విపక్షాల ప్రచారాన్ని తిప్పికొట్టి బిజెపికి పట్టం కట్టబెట్టారని అన్నారు. తాజా ఎన్నికలతో బిజెపి సుస్థిరత ఏర్పడిందని పేర్కొన్నారు. కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు నేటికీ అర్ధం చేసుకోలేదని, అర్ధం అయినా దానిని జీర్ణించుకోలేకపోతున్నారని వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పూర్తిగా అర్ధం అవుతుందని చెప్పారు.

చిత్రం..బీసీ కులాలకు రిజర్వేషన్ల కల్పనపై కేంద్ర మంత్రి వెంకయ్యను సత్కరిస్తున్న బీసీ నేత ఆర్ కృష్ణయ్య