రాష్ట్రీయం

ఇది న్యాయమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 3:తమ పార్టీనుంచి తెలుగుదేశంలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడంపై విపక్ష నేత జగన్ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. సోమవారం ఆయన పార్టీ ఎంపి వైవి సుబ్బారెడ్డి, ఎమ్మెల్యేలు కోన రఘుపతి, బాల నాగిరెడ్డిలతో గవర్నర్ నరసింహన్‌ను రాజ్‌భవన్‌లో కలిసి ఈ మేరకు ఫిర్యాదు చేస్తూ లేఖ అందించారు. తెలుగుదేశం అధికారం చేపట్టిన తర్వాత పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి 17 మంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నదని జగన్ గవర్నర్ దృష్టికి తీసుకెళ్ళారు. వీరిలో ఆది నారాయణరెడ్డి, అమర్‌నాథరెడ్డి, అఖిలప్రియ, సుజయకృష్ణ రంగారావులకు మంత్రివర్గంలో స్థానం కల్పించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తమ పార్టీ తరఫున ఎన్నికై టిడిపిలో చేరిన ఎమ్మెల్యేలపై పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం (10వ షెడ్యూలు) కింద అనర్హత వేటు వేయాలని కోరుతూ స్పీకర్ వద్ద పిటిషన్ దాఖలు చేశామని ఆయన తెలిపారు. అయితే స్పీకర్‌కు గత ఏడాది ఫిర్యాదు చేసినా ఇంతవరకు చర్య తీసుకోలేదన్నారు. పక్షం రోజులకు ఒకసారి తాము స్పీకర్‌ను కలిసి తమ పిటిషన్లపై త్వరగా నిర్ణయం తీసుకోవలసిందిగా కోరుతున్నామని ఆయన వివరించారు. స్పీకర్ వద్ద పార్టీ ఫిరాయింపుల కేసు పెండింగ్‌లో ఉండగా తమ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను మంత్రివర్గంలోకి తీసుకోవడం దారుణమని ఆయన తెలిపారు. ఈ విషయంలో జోక్యం చేసుకుని పార్టీ ఫిరాయించి, మంత్రి పదవులు చేపట్టిన వారిని తొలగించాలని గవర్నర్‌ను కోరారు.