రాష్ట్రీయం

కలెక్టరే సర్వాధికారి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 5: ఇందిరమ్మ ఇళ్లలో జరిగిన అవినీతి, అక్రమాలు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లల్లో పునరావృతం కాకుండా ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికను రూపొందించింది. లబ్ధిదారుని ఎంపికపై సర్వాధికారాలను కలెక్టర్లకు కట్టబెట్టింది. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పథకం అమలు కమిటీకి కలెక్టర్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. సంబంధిత జిల్లాకు చెందిన మంత్రి అధ్యక్షునిగా ఎమ్మెల్యేలు సభ్యులుగా మరో కమిటీని ఏర్పాటు చేస్తారు. దశల వారీగా చేపట్టనున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకంలో ప్రాధాన్యత క్రమంలో ఏ ఏ గ్రామాలను చేర్చాలన్నది మాత్రమే ఎమ్మెల్యేలు ప్రతిపాదిస్తారు. ఆ తర్వాత లబ్ధిదారుల ఎంపికలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు ఎవరికి ప్రమేయం లేకుండా ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందించింది. ఇళ్లులేని నిరుపేదలను రాజకీయాలకు అతీతంగా అర్హత కలిగిన ఉన్న లబ్ధిదారులను ఎంపిక చేసే బాధ్యత పూర్తిగా కలెక్టర్లకే ఉంటుంది. ఇందులో రాజకీయ జోక్యానికి తావు లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. లబ్ధిదారుల ఎంపికలో ఏదైనా తప్పిదం జరిగితే దానికి కలెక్టర్‌నే బాధ్యుడిని చేసే విధంగా మార్గదర్శకాలను ప్రభుత్వం రూపొందించింది. మంత్రి అధ్యక్షుడిగా ఉండే కమిటీలో సభ్యులుగా ఉండే ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గంలోని గ్రామాలను, పట్టణ ప్రాంతాల్లో అయితే వార్డులను మాత్రమే ప్రతిపాదిస్తారు. ఆ తర్వాత కలెక్టర్ కన్వీనర్‌గా ఉండే కమిటీ లబ్ధిదారులను ఎంపిక ప్రక్రియను చేపడుతుందని మార్గదర్శకాలలో పేర్కొన్నారు. లబ్ధిదారుల ఎంపికకు కలెక్టర్ కన్వీనర్‌గా ఉండే కమిటీ గ్రామ, వార్డు సభలను నిర్వహించి దరఖాస్తులు స్వీకరిస్తుంది. వచ్చిన దరఖాస్తులలో ప్రాధాన్యత క్రమంలో ఎంపిక చేసి అర్హుల జాబితాను తహశీల్దారులకు పంపిస్తుంది. దరఖాస్తులను తహశీలుదారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హుల జాబితాను తిరిగి కలెక్టర్లకు పంపిస్తుంది. అంతిమ పరిశీలన పూర్తి అయిన లబ్ధిదారుల జాబితాను గ్రామ, వార్డు సభలు నిర్వహించి ప్రకటిస్తుంది. గ్రామ, వార్డు సభలు ఆమోదించిన తుది జాబితాలోని లబ్ధిదారులను లాటరీ పద్ధతిలో ఎంపిక చేసి ఆమోదం కోసం జాబితాను మంత్రి అధ్యక్షతన ఉండే కమిటీకి పంపిస్తుంది. జిల్లా కమిటీ ఆమోదం తెలిపిన జాబితాతో కలెక్టర్ నోటిఫికేషన్ జారీ చేస్తారు. జిల్లా యూనిట్‌గా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపుల్లో రిజర్వేషన్లను అమలు చేస్తారు. గ్రామీణ ప్రాంతాల్లోని డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లల్లో ఎస్‌సి, ఎస్‌సిలకు 50 శాతం, మైనార్టీలకు 7శాతం రిజర్వు చేసి మిగిలిన 43శాతాన్ని ఇతరులకు కేటాయించాలని ప్రభుత్వం మార్గదర్శకాలలో పేర్కొంది. పట్టణ ప్రాంతాల్లో అయితే ఎస్‌సిలకు 17శాతం, ఎస్‌టిలకు 6శాతం, మైనార్టీలకు 12శాతం ఇళ్లను రిజర్వు చేసింది. ఎంపిక చేసిన లబ్ధిదారునికి తప్పనిసరిగా ఆహార భద్రత కార్డు ఉండటాన్ని ప్రాథమిక అర్హతగా ఖరారు చేసింది.