రాష్ట్రీయం

జన్మభూమి ఫిర్యాదుల్లో 96 శాతం పరిష్కరిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 8: జన్మభూమి కార్యక్రమం నిర్వహించినప్పుడు వచ్చిన ఫిర్యాదుల్లో 96 శాతం పరిష్కారమైనట్లు నిరూపిస్తే తాను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని కాంగ్రెస్ నాయకుడు, ఎపి శాసనమండలి (కౌన్సిల్)లో ప్రతిపక్ష నేత సి. రామచంద్రయ్య ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సవాల్ విసిరారు. ఒకవేళ నిరూపించలేకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయాల నుంచి తప్పుకుంటారా? అని ఆయన శుక్రవారం పార్టీ నాయకుడు, మాజీ మంత్రి డాక్టర్ ఎస్. శైలజానాథ్, పార్టీ నాయకుడు జంగా గౌతమ్‌తో కలిసి విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రశ్నించారు. ప్రస్తుతం జరుగుతున్న జన్మభూమి కార్యక్రమానికి ప్రజా స్పందన కరువైందని, ప్రతి చోటా అధికారులను ప్రజలు నిలదీస్తున్నారని ఆయన తెలిపారు. రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు ఎక్కడ ప్లాట్లు ఇస్తారో చెప్పడం లేదని, వారితో ఏర్పాటు చేసిన సమావేశానికి మంత్రులు నారాయణ, పత్తిపాటి పుల్లారావు ఎందుకు మోహం చాటేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. రైతులకు మొండి చేయి చూపిస్తూ, ఇప్పుడు రాజధాని నిర్మాణంలో భాగస్వామ్యం కావాలంటున్నారని, విద్యార్థుల ప్యాకెట్ మనీలో నుంచి 10 రూపాయలు తీసుకోవాలన్న ఆలోచన చేయడం సిగ్గుచేటని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతి విషయానికి ప్రతిపక్షాలను చులకన చేస్తూ మాట్లాడుతూ ప్రజాస్వామ్య స్పూర్తికి విఘాతం కలిగిస్తున్నారని అన్నారు. ప్రతిపక్షాలను గౌరవించడం లేదని, వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవడం లేదని ఆయన విమర్శించారు. ఏ కార్యక్రమం చూసినా తన అనుయాయులకు, పార్టీ వారికి లక్షలు, కోట్ల రూపాయలు కట్టబెట్టే ప్రయత్నమే తప్ప ప్రజా సంక్షేమం ఏ మాత్రం లేదని తీవ్రంగా విమర్శించారు. మాజీ మంత్రి శైలజానాథ్ మాట్లాడుతూ రాజకీయ కుట్రతోనే తమ పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణును అరెస్టు చేశారని ఆరోపించారు.