రాష్ట్రీయం

వచ్చే ఉగాదికి డబుల్ బెడ్‌రూంలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిరిసిల్ల, ఏప్రిల్ 8: వచ్చే ఉగాదినాటికి రెండు పడక గదుల ఇళ్ళ నిర్మాణం పూర్తి చేసి లబ్దిదారులకు అందిస్తామని మున్సిపల్ మంత్రి కె తారకరామారావు హామీ ఇచ్చారు. మండెపల్లి శివారులో నిర్మిస్తున్న 1260 డబుల్ బెడ్‌రూం ఇళ్ళలో వచ్చే దసరాకు మొదటి దశ కింద 300 నుండి 400 ఇళ్ళను పూర్తి చేసి లబ్దిదారులకు అందించేందుకు ప్రణాళిక చేపట్టామన్నారు. ఆ దిశగా రోడ్ల భవనాల శాఖ అధికారులు పకడ్బందీ ప్రణాళికతో ముందుకు సాగాలన్నారు. శనివారం జిల్లా కేంద్రానికి ఆకస్మికంగా వచ్చ్లి ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ప్రగతిపై అధికారులతో సమీక్షించారు. ముఖ్యంగా ప్రతిష్టాత్మక కార్యక్రమాలైన రెండు పడక గదుల ఇళ్ళ నిర్మాణం, మిషన్ భగీరథ, సిరిసిల్ల పట్టణ అభివృద్ది, సుందరీకరణ, రోడ్ల విస్తరణ, వైద్య, ఆరోగ్యం తదితర అంశాలపై సంబంధిత జిల్లా అధికారులతో కూలంకషంగా చర్చించారు.
మండెపల్లి గ్రామంలో ఇటీవలే శంకుస్థాపన చేసిన 2బిహెచ్‌కె ఇళ్ళ నిర్మాణ ప్రగతిని ఇఇని అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ పనులు అతి త్వరగా ప్రారంభిస్తామని ఆర్ అండ్ బి ఇఇ తెలిపారు. పనులను వేగవంతం చేసేందుకు వీలుగా నిర్మాణ పనుల ప్రారంభానికి ముందే విద్యుత్, నీరు, రోడ్డు వంటి వౌళిక సౌకర్యాలు సక్రమంగా ఉండేలా చూసుకోవాలని మంత్రి ఆదేశించారు. వాటిని పూర్తి చేసేందుకు నిర్దిష్ట గడువును రూపొందించుకుని ముందుకు సాగాలన్నారు. జిల్లాకు అదనంగా 2 బిహెచ్‌కె ఇళ్లు త్వరలో కేటాయించనున్నందున, వాటి నిర్మాణాల కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. ప్రతి నెలా కొన్ని ఇల్లు లబ్దిదారులకు అందించేలా ప్రణాళికలు ఉండాలన్నారు. క్షేత్ర స్థాయిలో ఏమైనా ప్రతిబందకాలుంటే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురావాలని మంత్రి అధికారులకు స్పష్టం చేశారు. అనంతరం మంత్రి కెటిఆర్ మిషన్ భగీరథ పనుల ప్రగతిపై సమీక్షించారు. ఈ పథకం కింద తాగునీరు అందించకపోతే ఓట్లు అడగనని సిఎం ప్రజలకు చెప్పినందున వారి నమ్మకంను నిలబెట్టేలా అధికారులు పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. డిసెంబర్ 2017 నాటికల్లా సిరిసిల్ల, వేములవాడ పట్టణాలతో సహా జిల్లాలోని అన్ని గ్రామాలకు చెందిన 97 వేల కుటుంబాలకు నల్లా ద్వారా సురక్షిత తాగు నీరు అందించాలని మిషన్ భగీరథ ఈఈని మంత్రి ఆదేశించారు. అంతర్గత పైప్‌లైన్‌ల నిర్మాణం కూడా చేపట్టాలన్నారు. ఆ వెంటనే మంత్రి సిరిసిల్ల పురపాలక పని తీరు, అభివృద్ధి, సుందరీకరణ పనులపై చైర్‌పర్సన్ సామల పావని, కమీషనర్ సుమన్‌రావులతో చర్చించారు.
రోడ్డు విస్తరణతో తాగునీటి పైప్ లైన్‌ల నిర్మాణం, విద్యుత్ స్తంబాల షిఫ్టింగ్ పనులు ఏక కాలంలో చేయాలని ఆర్‌డబ్ల్యుఎస్, సెస్ అధికారులను ఆదేశించారు. రోడ్ల విస్తరణకు అడ్డంగా ఉన్న నిర్మాణాల తొలగింపును మొదట ప్రభుత్వ కార్యాలయాలతోనే ప్రారంభించాలన్నారు. ప్రహారీలు ఇతర నిర్మాణాలను కూల్చివేసిన వెంటనే సాద్యమైనంత త్వరగా తిరిగి నిర్దేశిత నిబంధనలను అనుసరించి నిర్మాణం చేపట్టాలన్నారు. రాష్ట్రం, దేశంలోనే ఆదర్శవంతమైన మున్సిపాలిటీగా సిరిసిల్లను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నందున, ఓడిఎఫ్ వంద శాతం చేసిన మాదిరిగానే ఎల్‌ఇడిల ఏర్పాటు, డిఆర్‌సి, వ్యర్ధాల విభజన, వంద శాతం జరుగాలన్నారు. డంప్ యార్డును ప్లాంటేషన్‌తో అందంగా తీర్చిదిద్దాలన్నారు. స్వచ్ఛ సిరిసిల్ల ఆటో టిప్పర్స్‌ను ప్రారంభించాలని మున్సిపల్ అధికారులను మంత్రి కెటిఆర్ ఆదేశించారు. ‘సేఫ్ అండ్ స్మార్ట్ టౌన్’లో భాగంగా అవసరమైన చోట సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలని పోలీస్, మున్సిపల్ అధికారులకు సూచించారు. పట్టణంలో జంతు వధశాల ఏర్పాటు, బస్ బేల నిర్మాణం, రైతు బజార్ రీడిజైన్, రింగ్ రోడ్డు సమీపంలో ఎఎన్‌సి నిర్మాణం ఇలా అవసరమైన అన్నింటికి చర్యలు వచ్చే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాటికి అన్ని ప్రభుత్వ శాఖలు జిల్లాలో ప్రజలకు సులభంగా, వేగంగా సేవలందించేందుకు కొత్త కార్యక్రమాలతో ముందుకు రావాలని మంత్రి కెటిఆర్ కోరారు. ఈ సమావేశంలో ఎంపి వినోద్‌కుమార్, కలెక్టర్ కృష్ణ్భాస్కర్, సెస్ చైర్మన్ దోర్నాల లక్ష్మారెడ్డి, ఎస్‌పి విశ్వజిత్ కంపాటి, డిఆర్‌ఓ శ్యాంప్రసాద్‌లాల్, ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

చిత్రం..సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి కెటిఆర్