రాష్ట్రీయం

తెలంగాణ మంత్రికి తప్పిన ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, ఏప్రిల్ 9: రాష్ట్ర విద్యుత్, షెడ్యూల్ కులాల సంక్షేమశాఖ మంత్రి జి.జగదీష్‌రెడ్డి ఆదివారం హైద్రాబాద్-విజయవాడ రహదారిపై చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నారు. మంత్రి జగదీష్‌రెడ్డి హైద్రాబాద్ నుండి సూర్యాపేటకు వెళుతుండగా కట్టంగూర్ మండలం ఎరసానిగూడెం గ్రామం నుండి నకిరేకల్ వైపు వెళుతున్న ఇన్నోవా కారు ఆకస్మాత్తుగా హైవేపైకి వేగంగా వచ్చి మంత్రి కాన్వాయ్ మీదకు దూసుకొచ్చింది. కాన్వాయ్‌లో జగదీష్‌రెడ్డి ప్రయాణిస్తున్న ఫార్చునర్ కారుకు ముందున్న ఇన్నోవా కారు డ్రైవర్ కృష్ణయ్య తమపైకి దూసుకొచ్చిన కారుకు దూరంగా తమ కారును పక్కకు తప్పించగా అదే సమయంలో హైద్రాబాద్ వైపు వెళుతున్న ఐ20కారును ఢీ కొట్టింది. ఘటనలో ఐ20 కారు లో ప్రయాణిస్తున్న జిల్లాలోని గరిడేపల్లి మండలం గడ్డిపల్లికి చెందిన ఆరేపుడి సత్యం, ఆయన కుమారుడు సంతన్‌లకు స్వల్ప గాయాలయ్యాయి. మంత్రి కాన్వాయ్‌లోని ఇన్నోవా కారు డ్రైవర్ కృష్ణ, మంత్రి వ్యక్తిగత సహాయకుడు లింగయ్య, బంధువు కరుణాకర్‌రెడ్డి, గన్‌మెన్ అవినాశ్‌రెడ్డిలకు కూడా గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే గాయపడిన వారందరినీ నార్కట్‌పల్లి కామినేని ఆసుపత్రికి తరలించారు. ఇందులో వ్యక్తిగత సహాయకుడు లింగయ్య పరిస్థితి విషమంగా ఉండటంతో అతడిని హైద్రాబాద్‌కు తరలించారు. మంత్రి జగదీష్‌రెడ్డి సైతం సూర్యాపేటకు వెళ్లి అక్కడి నుండి లింగయ్యను పరమార్శించేందుకు ఇతర కార్యక్రమాలన్నీ రద్దు చేసుకుని హైద్రాబాద్ వెళ్లిపోయారు. మంత్రి జగదీష్‌రెడ్డి కాన్వాయ్‌కి రోడ్డు ప్రమాదం జరిగిందన్న సమాచారం అందుకున్న టిఆర్‌ఎస్ శ్రేణులు తొలుత తీవ్ర ఆందోళనకు గురయ్యాయి. ప్రమాదం తప్పిందన్న సమాచారంతో టిఆర్‌ఎస్ నాయకు లు, కార్యకర్తలంతా ఊరట చెందారు.