రాష్ట్రీయం

ప్రగతికోసం ప్రజలిచ్చిన తీర్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 9: ‘దేశ ప్రగతి, మార్పు కోసం ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు..’ అని బిజెపి జాతీయ నాయకుడు, కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై వ్యాఖ్యానించారు. ముస్లింలతో సమస్య లేదు కానీ వామపక్షాలే దేశానికి అత్యంత ప్రమాదకరమని దత్తాత్రేయ దుయ్యబట్టారు. ‘పశువధ శాలలు-యుపి సిఎం ఆదిత్యనాథ్ యోగి చర్యలు..’ అనే అంశంపై ఆదివారం ‘ఆర్య యువ వాహిని’ ఏర్పాటు చేసిన సమావేశంలో కేంద్ర మంత్రి దత్తాత్రేయ ప్రసంగిస్తూ వామపక్షాలపై, ఇతర ప్రతిపక్షాలపై చురకలు వేశారు. తాము ఏది చేసినా ముస్లింలకు వ్యతిరేకం అనే ప్రచారాన్ని కొందరు పనికట్టుకుని చేస్తున్నారని విమర్శించారు. హిందూ-ముస్లింల మధ్య నాటిన విష భీజాన్ని తొలగించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారని ఆయన చెప్పారు. పశువధ శాలలకు వ్యతిరేకంగా 1880 సంవత్సరం నుంచే ఆందోళనలు జరుగుతున్నాయని ఆంధ్రభూమి సంపాదకులు ఎంవిఆర్ శాస్ర్తీ చెప్పడాన్ని ఆయన ప్రస్తావిస్తూ యుపి సిఎం పశువధ శాలలను మూసి వేయిస్తుంటే ఘోరపరాజయం చవి చూసిన విపక్షాలు విమర్శించడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీనే సిఎం యోగి అమ లు చేస్తున్నారని ఆయన చెప్పారు. పశువధ శాలలపై పాఠశాల స్థాయి నుంచే చైతన్యం తేవాల్సి ఉందని, గోశాలలు ఇంకా పెంచాల్సి ఉందని అన్నారు. సంపాదకులు ఎంవిఆర్ శాస్ర్తీ చేసే రచనలతో మిగతా వారు పడుకుంటారని, ఇక లేవరని కేంద్ర మంత్రి దత్తాత్రేయ అనడంతో సభికులు పెద్దగా నవ్వారు.
హిందూ సమాజంలో చైతన్యం
ఆగదు: ఎంవిఆర్ శాస్ర్తీ
ఆంధ్రభూమి సంపాదకులు ఎంవిఆర్ శాస్ర్తీ ప్రసంగిస్తూ హిందూ సమాజంలో చైతన్యం వచ్చిందని, ఎవరు ఆపినా ఆగదని అనడంతో సభికులు కరతాళధ్వనులు చేశారు. చరిత్ర కొత్తగా ఆరంభమైందని, ఎవరు అడ్డుపడినా భవిష్యత్తు యోగిదే అనడంతో సభికులు హర్షధ్వానాలు చేశారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మన దగ్గరే జరుగుతుంటాయని అన్నారు. ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల్లో ప్రజలు నాలుగింట మూడవ వంతు సీట్లలో బిజెపిని గెలిపించారని ఆయన తెలిపారు. మొత్తం మీడియా, మేధావులు, టీవీ చానళ్ళు, దేశాన్ని ఉద్ధరించడానికి పుట్టిన వారు బిజెపి గెలిస్తే దేశానికి ప్రమాదకరమని, హిందూత్వం దేశాన్ని సర్వనాశనం చేస్తుందని విష ప్రచారం చేసినా, ప్రజలు బిజెపిని 325 సీట్లలో గెలిపించారని అన్నారు. యుపి సిఎం కాషాయం కట్టాడని పనికి మాలిన అంశాన్ని వివాదాస్పదం చేయడం ప్రపంచంలో ఎక్కడా లేదని ఆయన విమర్శించారు. అధికారంలోకి వస్తే అక్రమ గోవధ శాలలను మూసి వేయిస్తామన్న హామీ మేరకు చర్యలు చేపడితే తప్పుపట్టడం సిగ్గుచేటని అన్నారు.
సుప్రీం కోర్టు కూడా..
అక్రమ గోవధ శాలలను ఉన్నట్లుండి రద్దు చేస్తే ఎలా? వారికి ప్రత్యామ్నాయం ఏమిటీ? అని సుప్రీంకోర్టు కూడా ప్రభుత్వాన్ని వివరణ కోరడం విస్మయం కలిగించిందని ఎంవిఆర్ శాస్ర్తీ అన్నారు. లక్నోలో గోమాంసం వండించే రెస్టారెంట్ మూతపడిందని, జూ పార్కులో పులికి మాంసం వేసేందుకు దొరకడం లేదని కొందరు వ్యాఖ్యానించారని ఆయన తెలిపారు. గోవధను నిషేధించడం వల్ల ముస్లింల మనోభావాలు దెబ్బతింటాయని అంటున్నారని ఆయన చెప్పారు. ముస్లిం ల కంటే హిందువుల్లో చెడ పుట్టిన వారు, విపరీతమైన భ్రష్ట సంస్కృతి వారు ఎక్కువ తింటున్నారని ఆయన విమర్శించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో 18 శాతం మంది ముస్లింలు నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారని, వారు బిజెపికి వ్యతిరేకంగా ఓటు వేసి ఉంటే 100 నియోజకవర్గాల్లో ఆ పార్టీ ఓడిపోయేదని అన్నారు. కానీ అక్కడి ముస్లిం లు బిజెపిని నెత్తిన పెట్టుకున్నారని ఆయన తెలిపారు.
మార్పు కోరుతున్నారు..
ముస్లిం మహిళలు మార్పు కోరుతున్నారని, అయి నా తలాఖ్‌లపై ఇంకా ఆలోచిస్తున్నామని అన్నా రు. దీనిపై మేధావుల చర్చ జరగాలని ఆయన సూచించారు. ‘యుపి సిఎం యోగి ఆది కాదు, భవిష్యత్తు యోగినే..’ అనడంతో సభికులు హర్షధ్వానాలు చేశారు. ఎవరు అడ్డుపడినా, చరిత్ర కొత్తగా ఆరంభమైందని అన్నారు. గోవధ శాలల అంశం హిందూ, ముస్లింలకు సంబంధించింది కాదని, దీనిని ఆంగ్లేయు లు ఈ రెండు వర్గాల మధ్య పెట్టిన చిచ్చు అని ఎంవిఆర్ శాస్ర్తీ తెలిపారు. 1880వ సంవత్సరంలోనే దయానంద సరస్వతి గోవధ శాలలకు వ్యతిరేకంగా ఉద్యమించారని, ఇందులో హిందువులు-ముస్లింలూ పాల్గొన్నారని ఆయన చెప్పారు. ఇప్పుడు కూడా ఆర్యసమాజ్ ఒక్కటే అడ్డుకోగలదని ఎంవిఆర్ శాస్ర్తీ తెలిపారు.
ఆవు సంస్కృతికి ప్రతీక: రాధేశ్యాం శుక్లా
వార్త (హిందీ) దినపత్రిక సంపాదకులు రాధేశ్యాం శుక్లాజీ ప్రసంగిస్తూ ఆవు హిందూ సంస్కృతికి ప్రతీక అని చెప్పారు. ఆర్యసమాజ్, ఆర్‌ఎస్‌ఎస్ ఒక తాటిపైకి వచ్చి సంఘటితంగా పని చేయాలని ఆయన ఆకాంక్షించారు. ఆర్య ప్రతినిధి సభ (ఎపి-తెలంగాణ) ప్రధాన కార్యదర్శి విఠల్ రావు ఆర్య సభకు అధ్యక్షత వహించారు. ఇంకా ఈ సమావేశంలో ఆర్యప్రతినిధి సభ అధ్యక్షుడు లక్ష్మణ్ సింగ్ ఆర్య, అల్‌కబీర్ ప్రతినిధి జస్వంత్‌జీ, వివేక్ మోదీ, మహేశ్ అగర్వాల్, జస్వంత్ పటేల్ ప్రభృతులు ప్రసంగించారు. ఆర్య యువ వాహిని నాయకుడు సుధాకర్ వందన సమర్పణ చేశారు.

చిత్రం..‘పశువధ శాలలు-యుపి సిఎం ఆదిత్యనాథ్ యోగి చర్యలు..’ అనే అంశంపై ఆదివారం ‘ఆర్య యువ వాహిని’ ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతున్న ఆంధ్రభూమి ఎడిటర్ ఎంవిఆర్ శాస్ర్తీ.
చిత్రంలో దత్తాత్రేయ, రాధేశ్యాంజీ, విఠల్‌రావు తదితరులు ఉన్నారు.