రాష్ట్రీయం

ఉద్యమంగా జల సంరక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 10: రాష్టవ్య్రాప్తంగా రాబోయే 90 రోజులు జల సంరక్షణ ఉద్యమాన్ని ఉద్ధృతం చేయాలని సిఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్‌తో కలిసి ‘నీరు- ప్రగతి’ పురోగతిపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏప్రిల్ 15 నుంచి జూలై 15 వరకు జలసంరక్షణ ఉద్యమం అన్ని జిల్లాల్లో నిర్వహిస్తున్నట్టు తెలిపారు. విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు ఇందులో ఉత్సాహంగా పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. జలసంరక్షణ ఉద్యమంలో పాల్గొనడం సామాజిక బాధ్యతగా అందరూ గుర్తించాలన్నారు. జలసంరక్షణ ఉద్యమం జాతీయస్థాయిలో నమూనాగా నిలవాలని ఆకాంక్షించారు. నీటిని సక్రమంగా వినియోగించుకుంటే ఏటా వ్యవసాయంలో 25శాతం వృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఎక్కడా ఒక్క మొక్క, ఒక్క చెట్టు ఎండిపోకుండా చూడాలని, పర్యావరణాన్ని కాపాడాలని చంద్రబాబు కోరారు. సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులకు జలసంరక్షణ ఒక ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ అన్నారు. ప్రతి నియోజకవర్గం, మండలానికి సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులు తరలివెళ్లాలని, జలసంరక్షణ ఉద్యమంలో ఉత్సాహంగా పాల్గొనాలని కోరారు. మూడు నెలల్లో 20వేల చెక్ డ్యాములు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. చెరువు గట్లపై జంగిల్ క్లియరెన్స్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.
సెలయేళ్లను అభివృద్ధి చేయాలని, వాగులు, వంకల్లో నీటి ప్రవాహానికి అవరోధాలు లేకుండా చూడాలని, పూడికతీత పనులు వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. వీటికి సంబంధించి కార్యాచరణ ప్రణాళిక జిల్లాలవారీగా రూపొందించి అమలు చేయాలన్నారు. నీటి కొరత ప్రధాన సమస్యగా పేర్కొంటూ దీన్ని అధిగమించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటికే 3,11,161 పంట కుంటల తవ్వకం పూర్తయిందంటూ, దేశంలోనే ఆంధ్ర రాష్ట్రం ముందుందన్నారు. మిగిలిన లక్ష పంట కుంటల తవ్వకం కూడా వెంటనే పూర్తిచేయాలన్నారు. వానలకు ముందే శ్లాబులు పడాలి: సిఎస్ గృహ నిర్మాణ పనులపై అధికార యంత్రాంగం పూర్తిగా దృష్టి కేంద్రీకరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ సూచించారు. పక్కా ఇళ్ల నిర్మాణం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతిష్ఠాత్మక కార్యక్రమంగా పేర్కొంటూ ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతమయ్యేలా శ్రద్ధ వహించాలని కోరారు. హౌసింగ్ వర్క్ ఇన్‌స్పెక్టర్ల పోస్టులు వెంటనే భర్తీ చేయాలన్నారు. మరో 4 లక్షల ఇళ్లు రాష్ట్రానికి మంజూరయ్యాయని వివరిస్తూ, వాటికి కావాల్సిన సిమెంట్, స్టీల్ సిద్ధం చేసుకోవాలని సూచించారు. వర్షాకాలానికి ముందే ఇళ్ల శ్లాబులు పడేలా చూడాలన్నారు. ప్రతివారం హౌసింగ్ పురోగతిపై కలెక్టర్లు సమీక్షించాలని, ప్రతి 15 రోజులకు తాను సమీక్ష నిర్వహిస్తానని చెప్పారు. అంగన్‌వాడీ, పంచాయతీ భవనాల నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వర్మీకంపోస్టు పిట్లు ఇప్పటివరకు 1,19,369 పూర్తయ్యాయని, మిగిలినవి పూర్తిచేయాలన్నారు. రూ.5716 కోట్ల నరేగా నిధులు వినియోగించుకుని దేశంలోనే ఆంధ్ర రెండోస్థానంలో నిలిచిందన్నారు. కన్వర్జెన్స్ ద్వారా నరేగాను ఇంత భారీగా వివిధ శాఖల్లో వినియోగించుకున్న రాష్ట్రం మనదేనన్నారు. పంచాయతీరాజ్ కమిషనర్ రామాంజనేయులు మాట్లాడుతూ నరేగాలో ఎంత అభివృద్ధి సాధించామో అంతే స్థాయిలో విమర్శలూ ఉంటాయంటూ, ఎప్పటికప్పుడు అధికారులు మీడియాలో వచ్చే విమర్శలకు తగిన జవాబిచ్చి ప్రజల్లో అపోహలను తొలగించాలన్నారు. ప్రతిదీ ఆన్‌లైన్ చేశామని, జియో ట్యాగింగ్ చేస్తున్నారుని, కనుక అవినీతి అక్రమాలకు ఆస్కారం ఉండదన్నారు. టెలికాన్ఫరెన్స్‌లో జలవనరుల శాఖ చీఫ్ ఇంజనీర్ వెంకటేశ్వరరావు, పట్టణాభివృద్ధి శాఖాధికారి జవహర్‌రెడ్డి, హౌసింగ్ అధికారి కెవి రమణ, వివిధ జిల్లాల కలెక్టర్లు, ఎమ్మెల్యే కూన రవికుమార్, ఇతర ప్రజాప్రతినిధులు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.