రాష్ట్రీయం

కార్మికుల పిల్లలకు ప్రతిభ ఆధారంగా ఉపకారవేతనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 8: ఆంధ్రప్రదేశ్‌లో కార్మికుల పిల్లలకు ప్రతిభ ఆధారంగా ఆయా ఉన్నత విద్యాభ్యాసం మేరకు ఉపకార వేతనాలు అందిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ కార్మిక సంక్షేమ మండలి సంక్షేమ కమిషనర్ వివి పాండురంగరాజు ఒక ప్రకటనలో తెలిపారు. దుకాణాలు, వాణిజ్య సంస్థలు, కర్మాగారాలు, మోటారు రవాణా సంస్థలు, సహకార సంస్థలు, ధార్మిక, లేదా ఇతర ట్రస్టుల్లో పని చేస్తున్న కార్మికుల పిల్లలకు ప్రతిభ ఆధారంగా ఉపకార వేతనాలు ఇస్తున్నట్లు ఆయన ఆ ప్రకటనలో తెలిపారు. పాలిటెక్నిక్ కోర్సుకు రూ.5 వేలు, ఇంజినీరింగ్, మెడిసిన్, లా, బిఎస్సీ వ్యవసాయం, వెటర్నరీ, నర్సింగ్, హార్టికల్చర్, బిసిఏ, బి.్ఫర్మశీ, ఎంఫార్మశీ, బిబిఏ, ఎంబిఏ, డిప్లోమా ఇన్ మెడికల్ లేబొరెటరీ టెక్నీషియన్, పిజి డిప్లోమా ఇన్ మెడికల్ లేబొరెటరీ టెక్నీషియన్ కోర్సుల్లో ఉన్న వారికి రూ.10వేల చొప్పున ఉపకార వేతనం మంజూరు చేస్తామని తెలిపారు. అభ్యర్థులకు వచ్చిన మార్కుల ఆధారంగా ఉపకార వేతనాలు మంజూరు చేస్తామని తెలిపారు.దరఖాస్తులను సంబంధిత కార్మిక శాఖ కార్యాలయంలో ఫిబ్రవరి 15లోగా దరఖాస్తులు సమర్పించాలని సంక్షేమ కమిషనర్ స్పష్టం చేశారు.