రాష్ట్రీయం

జుడీషియల్ కస్టడీకి మల్లాది విష్ణు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), జనవరి 8: కల్తీ మద్యం కేసులో కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు ఈనెల 19వ తేదీ వరకు రిమాండు విధిస్తూ విజయవాడ మొదటి అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆయన్ను పోలీసు భద్రత నడుమ జిల్లా జైలుకు తరలించారు. కాగా ఇదే సమయంలో విష్ణు తరుఫు న్యాయవాదులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి డిస్మిస్ చేశారు. అఙ్ఞతం వీడి కోర్టు ముందుకు వచ్చిన విష్ణును విచారణకు పిలిపించి రెండు రోజుల పాటు ప్రశ్నించిన మీదట అయన్ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచి అక్కడి నుంచి జైలుకు పంపేవరకూ నగర పోలీసు కమిషనర్ దామోదర్ గౌతం సవాంగ్ నేతృత్వంలో డిఐజి మహేష్ చంద్ర లడ్హా నాయకత్వం వహించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తొలుత నుంచీ కూడా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఈ కేసులో తొమ్మిదో నిందితుడైన విష్ణుతోపాటు అతని సోదరుడు మల్లాది శ్రీనివాస్ అలియాస్ బుల్లయ్యను కూడా అరెస్టు చేసి జైలుకు పంపారు. నిందితులను కోర్టులో హాజరుపరిచే సందర్భంగా గురువారం ఉదయం నుంచి సాయంత్రం ఏడున్నర గంటల వరకూ కోర్టు వద్ద హైడ్రామా నడిచింది. కృష్ణలంకలోని ఎం హోటల్ సెల్లార్‌లో నిర్వహిస్తున్న స్వర్ణ బార్ అండ్ రెస్టారెంట్‌లో గత ఏడాది డిసెంబర్ 7వ తేదీన మద్యం సేవించి ఐదుగురు మృత్యువాత పడగా, సుమారు 25మందికి పైగా అస్వస్థత పాలైన విషయం తెలిసిందే. రాష్టవ్య్రాప్తంగా సంచలనం రేకెత్తించిన ఈ ఘటనకు సంబంధించిన కేసులో పోలీసులు తాజాగా ఈ కేసులో మల్లాది విష్ణును సిట్ విచారించిన మీదట అదనంగా 409, 420, 272, 273, 120(బి) ఐపిసి కింద అదనపు సెక్షన్లు జోడించి కోర్టులో ప్రత్యేక పిటిషన్ దాఖలు చేశారు. 25రోజులుగా పరారీలో ఉన్న విష్ణు విజయవాడ కోర్టులో ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించాడు. అయితే పోలీసుల 41సిఆర్‌పిసి కింద నోటీసులు ఇవ్వడంతో కోర్టు ఆదేశాలతో ఈనెల 6వ తేదీన ఆయన సిట్ వద్ద విచారణకు హాజరయ్యారు.
రెండురోజుల పాటు విచారించిన సిట్ విష్ణు అతని సోదరుడు శ్రీనివాస్‌లను అరెస్టు చేసినట్లు గురువారం అర్ధరాత్రి ప్రకటించింది. విష్ణు, శ్రీనివాస్‌లను గట్టి బందోబస్తుతో మొదటి అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 19వ తేదీ వరకు రిమాండు విధించారు.

మాజీ ఎమ్మెల్యే విష్ణును రిమాండ్‌కు తరలిస్తున్న పోలీసులు