రాష్ట్రీయం

విద్యాసంస్థలకు అక్రిడిటేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 13:రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, ఉన్నత, ప్రాథమికోన్నత, ప్రాథమిక పాఠశాలలన్నింటికీ ఫలితాల ఆధారంగా అక్రిడిటేషన్ ఇచ్చే విధానాన్ని తక్షణం అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. నిర్దిష్ట ప్రమాణాలతో కూడిన విద్య, విజ్ఞానాలు అందించే విద్యాసంస్థలకు ప్రపంచ
స్థాయి అక్రిడిటేషన్ బోర్డుల్లో గుర్తింపు ఇవ్వగలిగితే పోటీతత్వం పెరిగి రాష్ట్రాన్ని ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దాలనే లక్ష్యాన్ని స్వల్ప కాలంలోనే చేరుకోగలుగుతామని ఆయన అన్నారు. గురువారం సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు తన కార్యాలయంలో మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావుతో కలిసి ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత, సాంకేతిక విద్యాశాఖల పనితీరును సమీక్షించారు. ఉన్నత పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయుల నియామకాలు ఒక ప్రత్యేక కమిటీ ద్వారా జరిగితే బాగుంటుందన్నారు. దీనివల్ల ప్రభుత్వ విద్యాలయాల్లో ప్రమాణాలు మెరుగుపడతాయనే అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి వ్యక్తం చేశారు.

చిత్రం..విద్యాసంస్థలకు అక్రిడిటేషన్ విధానంపై సమీక్షిస్తున్న చంద్రబాబు