రాష్ట్రీయం

టిఆర్‌ఎస్ తోక పార్టీలా వైఎస్‌ఆర్ పార్టీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 8: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా ధర్నాలు, నిరసనలు , ఆందోళనలు చేసిన వైకాపా ఇపుడు తెలంగాణలో అధికార పార్టీ టిఆర్‌ఎస్‌కు రహస్య మిత్రుడిగా మారిందని బహిరంగంగా మాత్రం ప్రత్యర్ధిలా వ్యవహరిస్తోందని తెలుగు మహిళా అధ్యక్షురాలు బండ్రు శోభారాణి అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ, హైదరాబాద్‌లో తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని సంపాదించిన వేల కోట్ల రూపాయిలు అక్రమాస్తులను కాపాడుకునేందుకు జగన్ టిఆర్‌ఎస్‌తో లోపాయికారి ఒప్పందం చేసుకున్నట్టు మరోసారి రుజువు అయిందని అన్నారు. అధికార పార్టీ టిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి వైకాపా ఎమ్మెల్యేలను టిఆర్‌ఎస్‌లో చేర్చుకుంటే కనీసం స్పీకర్ కూడా ఫిర్యాదు చేయలేదని ఉన్న ఒక్క ఎమ్మెల్యే ఓటును అధికార పార్టీ అభ్యర్ధికి వేయించారని అన్నారు. తాజాగా గ్రేటర్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని షర్మిల పరామర్శ యాత్ర పేరుతో హైదరాబాద్‌లో పర్యటిస్తున్నారని హైదరాబాద్ నగరాన్ని తమ తండ్రి అభివృద్ధి చేశారని చెబుతున్నారని అది సరికాదని అన్నారు. చంద్రబాబు పాలనలోనే హైదరాబాద్ అభివృద్ధి చెందిందని శోభారాణి పేర్కొన్నారు. హైదరాబాద్ నగరానికి ఒక్క ప్రాజెక్టును కూడా వై ఎస్ రాజశేఖరరెడ్డి తీసుకురాలేదని అన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని బంధువర్గం చేత వేలాది ఎకరాలు భూములను కబ్జా చేయించారని ఆమె ఆరోపించారు.
బదిలీల దరఖాస్తుల
గడువు 12 వరకూ పొడిగింపు
9 నుండి 17 వరకూ సంక్రాంతి సెలవులు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 8: ఆంధ్రప్రదేశ్‌లో అంతర్ జిల్లా బదిలీలకు దరఖాస్తు చేసుకునే గడువును జనవరి 12వ తేదీ రాత్రి 12 గంటల వరకూ పొడిగించినట్టు యుటిఎఫ్ అధ్యక్షుడు ఐ వెంకటేశ్వరరావు, ప్రధానకార్యదర్శి పి బాబురెడ్డి తెలిపారు. తప్పులు సరిచేసుకునేందుకు ఎడిట్ ఆప్షన్ చ్చారని, యుడైస్ లింక్‌ను తొలగించారని వివరించారు. తెలంగాణ జిల్లాల్లో లోకల్ స్టేటస్ ఉండి ఎపిలో పనిచేస్తున్న వారికి కూడా అంతర్‌జిల్లా బదిలీలకు అవకాశం కల్పించినట్టు వారు వివరించారు. ఈ మేరకు ప్రభుత్వం సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేసిందని అన్నారు. కాగా సంక్రాంతి సెలవులు అకడమిక్ కేలండర్ ప్రకారమే జనవరి 9వ తేదీ నుండి 17వ తేదీ వరకూ ఉంటాయని, జనవరి 18న పాఠశాలలు పున:ప్రారంభం అవుతాయని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కె. సంధ్యారాణి స్పష్టం చేశారు. జన్మభూమి కార్యక్రమం ఉన్న గ్రామాల్లో ఉపాధ్యాయులు మాత్రం హాజరుకావల్సి ఉంటుందని డైరెక్టర్ స్పష్టం చేశారు.
18నుంచి తిరుపతిలో నందినాటకోత్సవం
* రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమంగా
ప్రకటించిన ఎపి ప్రభుత్వం
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 8: ఈ నెల 18 నుంచి నంది నాటకోత్సవం -2015ను తిరుపతిలో నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. తిరుపతి మహతి ఆడిటోరియంలో 18న ప్రారంభమై 27వ తేదీతో ముగుస్తుందని ప్రభుత్వం శుక్రవారం జివో జారీ చేసింది. నంది నాటకోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వ అధికారిక కార్యక్రమంగా గుర్తిస్తూ ఆ జివో పేర్కొంది.