రాష్ట్రీయం

మరో పాక్ ఏర్పాటుకు ఆజ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 14:మతపరమైన రిజర్వేషన్లకు బిజెపి వ్యతిరేకమని, అవి ఏ న్యాయస్థానం ముందూ నిలవబోవని కేంద్ర సమాచార మంత్రి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. మత ప్రాతిపదికన రిజర్వేషన్లు మరో పాకిస్థాన్ రూపకల్పనకు దారి తీస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. వెనకబడిన తరగతుల వారికి రిజర్వేషన్లు కల్పించే విషయంలో మాత్రం తాము అనుకూలమని అన్నారు. మతపరమైన రిజర్వేషన్లు సామాజిక అశాంతికి దారితీస్తాయని, వివిధ వర్గాల మధ్య ఘర్షణ ఏర్పడుతుందని అన్నారు. ఈ తరహా రిజర్వేషన్లను రాజ్యాంగం ఒప్పుకోదని చెప్పారు. సామాజిక అసమానతలను, కులవివక్షను అంతమొందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ముస్లింలకు రిజర్వేషన్లు పెంచాలని తీసుకున్న నిర్ణయంపై వెంకయ్యనాయుడు తీవ్రంగా స్పందించారు. స్వాతంత్య్రం ముందు, అనంతరం దేశ ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని సమన్యాయం తీసుకురావడానికి, సామాజిక వివక్షను రూపుమాపడానికి అంబేద్కర్ కృషి చేశారని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ‘బీమ్-ఆధార్’ పథకాన్ని ప్రారంభించారని, ప్రతి కార్యకర్త కనీసం ఇద్దరిని గుర్తించి బీమ్ యాప్‌ను వినియోగించడం నేర్పించాలని వెంకయ్యనాయుడు హితవు చెప్పారు.
నాగ్‌పూర్‌లో 9.41 కోట్లతో బాబాసాహెబ్ అంబేద్కర్ దీక్షా భూమిని నిర్మిస్తున్నారని, అంబేద్కర్ చివరి రోజుల్లో న్యూఢిల్లీలో నివసించిన గృహాన్ని 1.84 ఎకరాల్లో విస్తరించి వందకోట్లతో స్మారక కేంద్రాన్ని కేంద్రం నిర్మిస్తోందని, 15 జనపథ్‌లో అంబేద్కర్ కనె్వన్షన్ సెంటర్‌ను కూడా నెలకొల్పుతోందని వెంకయ్య వెల్లడించారు.