రాష్ట్రీయం

సింగపూర్ కల కల్లే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 20: రాజధాని అమరావతి ప్రాంతంలో ఇష్టం వచ్చినట్లు అక్రమ నిర్మాణాలకు అనుమతిస్తే ప్రజలు ఆకాంక్షిస్తున్న సింగపూర్ తరహా రాజధాని కల నాశనమవుతుందని, అభివృద్ధి చెందిన దేశాల నగరంలోని వాతావరణం ఉండదని హైకోర్టు ఆందోళన వ్యక్తం చేంది. కృష్ణా జిల్లాలో తాను నిర్మించుకున్న ఇంటిని కూల్చివేయాలంటూ సిఆర్‌డిఏ అధికారులు జారీ చేసిన ఆదేశాలను సవాలు చేస్తూ ఎల్ రమేష్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ విచారించారు. ఈ కేసుకు సంబంధించి 27వ తేదీన సిఆర్‌డిఏ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి హాజరు కావాలని న్యాయమూర్తి ఆదేశించారు. సిఆర్‌డిఏ చట్టం, సిఆర్‌డిఏ నిబంధనల్లో అనేక లోపాలు ఉన్నాయని ఈ సందర్భంగా న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఈ విషయమై హైకోర్టుకు స్పష్టత ఇచ్చేందుకు తాము పేర్కొన్న ఇద్దరు అధికారులు కోర్టుకు హాజరుకావాలని ఆదేశించారు. చట్టంలోని లోపాల కారణంగా అమరావతి ప్రాంతంలో ఇష్టం వచ్చినట్లు అక్రమ నిర్మాణాలను అనుమతించినా, వాటిపై చర్యలు తీసుకోలేక వౌనం వహించినా, సింగపూర్ తరహాలో ఉన్నత ప్రమాణాలతో కూడిన రాజధానిగా అమరావతి అవతరిస్తుందన్న ప్రజల కలలు కల్లలవుతాయని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. అక్రమ నిర్మాణాలను అనుమతించే ధోరణి వాంఛనీయం కాదన్నారు. సిఆర్‌డిఏ సిబ్బందిలో ఉదాసీనత వల్లనే అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయని హైకోర్టు పేర్కొంది.