రాష్ట్రీయం

తరగతి గదిలో హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గంగవరం, ఏప్రిల్ 20:విద్యాలయంలో రక్తం పారింది. తరగతి గదిలో చిన్నారుల కళ్ల ముందే దారుణం జరిగింది. పాఠాలు బోధిస్తున్న ఓ టీచర్‌ను మరో టీచర్ కత్తితో పొడిచి చంపాడు. ఈ సంఘటనతో భీతావహులైన పిల్లలు తలోదిక్కుకూ పరుగులు తీశారు. ఈ దారుణ సంఘటన చిత్తూరు జిల్లా గంగవరం మండలం మేలుమాయి పంచాయతీ మబ్బువాళ్లపేట పాఠశాలలో గురువారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం క్లాసులో పాఠాలు చెబుతున్న ఉపాధ్యాయురాలు ప్రేమకుమారిని తోటి ఉపాధ్యాయుడు చంద్రవౌళి కత్తితో పొడిచి చంపాడు. ఇద్దరి మధ్యా కొంతకాలంగా ప్రేమ వ్యవహారం నడుస్తోంది. ఇటీవల ప్రేమకుమారి ఇతరులతో చనువుగా ఉంటోందని భావించిన చంద్రవౌళి దీనిని జీర్ణించుకోలేక గురువారం పాఠశాలలోనే ఆమెపై కత్తితో దాడి చేసి విచక్షణా రహితంగా పొడిచి చంపాడు. సమీపంలోని పాత గుండుగల్లు గ్రామంలో చంద్రవౌళి కూడా ఉపాధ్యాయుడుగా విధులు నిర్వహిస్తున్నాడు. గతంలోనూ వీరిద్దరికీ గొడవలు జరిగాయని, ఇటీవల వీరు ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు కూడా చేసుకున్నారని తెలిసింది. చంద్రవౌళికీ, ప్రేమకుమారికి గతంలోనే విడివిడిగా వివాహమైంది. ప్రేమ కుమారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్త హెల్త్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఉపాధ్యాయుడు చంద్రవౌళి గతంలో రియల్ ఎస్టేట్, ఇసుక, ట్రాన్స్‌పోర్టు వ్యాపారాలు నిర్వహిస్తుండేవాడు. కేవలం తన ప్రేయసికోసం భార్యకు విడాకులు ఇచ్చారని పోలీసులు తెలిపారు. గురువారం పాఠశాలలో విధుల్లో ప్రేమకుమారి ఉందని తెలుసుకున్న చంద్రవౌళి పాఠశాలకు వెళ్లి విద్యార్థుల ముందే విచక్షణారహితంగా కత్తితో పొడిచి హత్య చేసిన అనంతరం తాపీగా పారిపోయాడు. సంఘటన స్థలంలోనే ప్రేమకుమారి కుప్పకూలి మృతి చెందింది.

ప్రేమకుమారి (ఫైల్‌ఫొటో)