రాష్ట్రీయం

వరుణుడు కరుణిస్తే రోజూ నీళ్లే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 20: ఆశించిన స్థాయిలో వర్షాలు కురిస్తే డిసెంబర్ నెలాఖరు నుంచి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రోజూ మంచినీరు సరఫరా చేస్తామని రాష్ట్ర ఐటి, మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కెటిఆర్ తెలిపారు. ఇప్పటికే నగరంలోని 160 బస్తీల్లో ప్రతిరోజూ నీటి సరఫరా చేస్తున్నామన్నారు. రూ. 1900 కోట్ల హడ్కో నిధులతో శివార్లలో నిర్మించిన నాలుగు రిజర్వాయర్లను గురువారం ఆయన మంత్రు లు నాయిని నర్సింహారెడ్డి, మహేందర్‌రెడ్డి, ఎంపి కొండా విశే్వశ్వర్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం మీడియాతో మంత్రి మాట్లాడుతూ వచ్చే సంవత్సరం మే నెలలో పూర్తి కావలసిన ప్రాజెక్టు పనులను ఏడాది ముందే పూర్తి చేసినట్లు చెప్పారు. సెప్టెంబర్‌లోగా మిగిలిన రిజర్వాయర్ల పనులను కూడా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు. ఈ రిజర్వాయర్ల ద్వారా ఇప్పటికే ఉన్న కనెక్షన్లతోపాటు అదనంగా మరో లక్ష కొత్త కనెక్షన్లు ఇచ్చి, నీటి సరఫరా కల్పిస్తామన్నారు. మున్ముందు మహానగర జనాభా అయిదింతలు పెరిగినా నీటి ఇబ్బందులు తలెత్తకుండా శామీర్‌పేట కేశవాపూర్‌లో రూ. 7వేల కోట్లతో 20 టిఎంసిల సామర్థ్యంతో అతిపెద్ద రిజర్వాయర్లను ఏర్పాటు చేయనున్నామని, ఇందుకు సంబంధించి త్వరలోనే భూసేకరణను ప్రారంభించి పనులకు టెండర్ల ప్రక్రియను చేపట్టనున్నామనీ కెటిఆర్ చెప్పారు. ఒకప్పుడు నగరానికే పరిమితమైన జలమండలి పరిధిని ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఔటర్ రింగురోడ్డు వరకు విస్తరించామని చెప్పారు. ఔటర్ చుట్టూ ఉన్న గ్రామాలకు నీటి సరఫరా అందించేందుకు రూ. 628 కోట్లతో ప్రణాళికను సిద్దం చేశామన్నారు. దీనివల్ల 180 గ్రామాలకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. మంజీరా రింగ్ మెయిన్ కోసం రూ. 400 కోట్లు కేటాయించామని చెప్పారు. పైప్‌లైన్ల ఏర్పాటుకు రోడ్డు తవ్వేటపుడే, రోడ్డు రిస్టోరేషన్ పనులకు సంబంధించిన టెండర్లను కూడా పూర్తి చేస్తూ, పనులు ముగిసిన వెంటనే రోడ్ల పునరుద్ధరణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. అనంతరం ప్రతి మనిషికి 150 లీటర్ల చొప్పున నీటిని సరఫరా చేస్తామని, అందుకే అర్బన్ భగీరథ కార్యక్రమం కింద కేవలం రూపాయికే నల్లా కనెక్షన్లను ఇస్తున్నట్లు వివరించారు.

చిత్రం..శివార్లలోని నల్లగండ్లలో రిజర్వాయర్‌ను ప్రారంభిస్తున్న మంత్రి కెటిఆర్