రాష్ట్రీయం

సెగ్మెంట్‌కు వెయ్యి ఇళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 22: పేదలకు శుభవార్త. రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల్లో 95 అసెంబ్లీ నియోజకవర్గాలకు వెయ్యి చొప్పున డబుల్ బెడ్‌రూం ఇళ్లను మంజూరు చేస్తున్నట్టు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ప్రకటించింది. ఈమేరకు జీవో నెం 2ను జారీ చేసింది. ప్రతి నియోజకవర్గానికి కేటాయించిన ఇళ్లనుంచి పట్టణ ప్రాంతానికి 240, గ్రామీణ ప్రాంతానికి 160 నిష్పత్తిలో డబుల్ బెడ్‌రూంలు కేటాయిస్తారు. మహబూబ్‌నగర్ జిల్లాకు గరిష్టంగా 14వేల ఇళ్లు, రంగారెడ్డి జిల్లాకు కనిష్టంగా ఆరు వేల ఇళ్లను కేటాయించారు. మహబూబ్‌నగర్ జిల్లాలో 14 అసెంబ్లీలకు, వరంగల్ జిల్లాలో 12, రంగారెడ్డి జిల్లాలో ఆరు, మెదక్ జిల్లాలో 9, ఆదిలాబాద్ జిల్లాలో పది, నిజామాబాద్ జిల్లాలో 9, కరీంనగర్ జిల్లాలో 13, ఖమ్మం జిల్లాలో 10, నల్లగొండ జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒక్కో సెగ్మెంట్‌కు వెయ్యి చొప్పున ఇళ్లను కేటాయించారు. డబుల్ బెడ్‌రూం ఇళ్లకు పిఎంఎవై (జి), అందరికీ ఇండ్లు అనే కేంద్ర ప్రభుత్వ స్కీం నుంచి నిధులు విడుదల చేస్తారు. జిల్లా కలెక్టర్లు ఇళ్ల నిర్మాణాన్ని యుద్ధప్రాతిపదికన చేపట్టాలని ఆదేశించారు.

చిత్రం..హైదరాబాద్‌లోని బన్సీలాల్‌పేటలో శనివారం డబుల్ బెడ్‌రూం ఇళ్లకు శంకుస్థాపన చేస్తున్న మంత్రి కెటిఆర్