రాష్ట్రీయం

తెలంగాణ భగభగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 22: తెలంగాణ రాష్ట్రం నిప్పుల కొలిమిగా మారింది. ఉదయం 10 గంటల తర్వాత ప్రజలు రోడ్లపైకి వచ్చేందుకు భయపడిపోతున్నారు. ఎంతో అవసరమైతే తప్ప బయటకు రావొద్దని, వచ్చినా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఎండధాటికి చిన్న పిల్లలు, వృద్ధులు తట్టుకోలేక తల్లడిల్లుతున్నారు. వడదెబ్బలతో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు రద్దీగా మారాయి. తెలంగాణలో రాబోయే 48 గంటల్లో వాతావరణంలో మరిన్ని మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. ఫలితంగా కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరగడం, మరికొన్ని ప్రాంతాల్లో గాలి దుమారం, అక్కడక్కడ చిరుజల్లులు కురిసి కొంత ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని వాతావరణ పరిశోధనా విభాగం డైరెక్టర్ వైకె రెడ్డి శనివారం ‘ఆంధ్రభూమి ప్రతినిధి’కి చెప్పారు. భిన్నమైన వాతావరణ పరిస్థితులు చోటుచేసుకునే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. శనివారం నల్లగొండలో 44.2, ఖమ్మంలో 44 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైనట్టు ఆయన వివరించారు. రాష్టవ్య్రాప్తంగా వారం రోజుల్లో 42 డిగ్రీల సెల్సియస్ నుంచి 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైనట్టు ఆయన వివరించారు. ఇది సాధారణ ఉష్ణోగ్రత కంటే 3నుంచి 5 డిగ్రీల సెల్సియస్ అధికమని అన్నారు. ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, రాజన్న- సిరిసిల్ల, నిజాబాబాద్, కొమురంభీం- అసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్- భూపాల్‌పల్లి, భద్రాద్రి- కొత్తగూడెం, నల్లగొండ, సూర్యాపేట్, ఖమ్మం, జిల్లాల్లో 45 డిగ్రీల సెల్సియస్ వరకూ నమోదైందని ఆయన వివరించారు. మిగతా జిల్లాల్లో 41 నుంచి 43 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు రెడ్డి పేర్కొన్నారు. వచ్చే వారంలోనూ పైన తెలిపిన జిల్లాల్లో ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయని, 43 డిగ్రీల సెల్సియస్ నుంచి 46 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. మిగతా జిల్లాల్లో 41 నుంచి 44 డిగ్రీల సెల్సియస్‌గా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. ఈ వారం రోజుల్లో ఎంతో అవసరమైతే తప్ప ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు రావొద్దని అధికారులు చెబుతున్నారు.
పాఠశాలలకు సెలవులు
ఇలాఉండగా మండుతున్న వేసవిని దృష్టిలో పెట్టుకుని సిఎం కె. చంద్రశేఖర్ రావు ముందు జాగ్రత్తగా పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. నిజానికి మరో వారంపాటు పాఠశాలలు నడిపించాల్సి ఉన్నా, రెండు రోజుల క్రితమే సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే.