రాష్ట్రీయం

పేరు మినరల్ నీరు కెమికల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాఫియా ముఠాల నీళ్ల దందా వడపోత నీటికే మినరల్ ముసుగు
బిఎస్‌ఐ అనుమతి లేకుండానే అమ్మకం కోట్లలో నడుస్తున్న వ్యాపారం

హైదరాబాద్, ఏప్రిల్ 23:ఎండలు మండుతున్న వేళ మినరల్ వాటర్ మాఫియా కోరలు సాచింది. కెమికల్ వాటర్‌కి మినరల్ ముసుగు వేసి యథేచ్ఛగా అమ్మకాలు సాగిస్తోంది. చట్టబద్ధంగా అనుమతి ఉన్న ప్లాంట్లు వందల సంఖ్యలో ఉంటే, ఈ ఎండాకాలంలో అక్రమంగా వెలిసిన ప్లాంట్లు వేలలోనే ఉన్నాయంటే ఆశ్చర్యం కలుగుతుంది. కేవలం వడగట్టిన నీటిని క్యాన్లలో పోసి అమ్ముతుంటే, మినరల్ వాటరేనని భ్రమపడి కొంటున్న జనం అమాయకత్వమే ఆసరాగా ఈ వ్యాపారం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మూడు పువ్వులు...ఆరు కాయలుగా సాగిపోతోంది. హైదరాబాద్, వరంగల్, విశాఖపట్నం, విజయవాడ వంటి నగరాలే కాదు...కుగ్రామాలలోనూ ‘కెమికల్ వాటర్’ వ్యాపారం జోరుగా సాగుతోంది. ప్రభుత్వ అనుమతులు లేకుండా చట్టాలను అతిక్రమించి రెండు రాష్ట్రాల్లో దాదాపు25వేలకు పైగా మినరల్ వాటర్ ప్లాంట్లు పనిచేస్తున్నాయి. నీటి వ్యాపారం టర్నోవర్ సాలీనా రూ. 60 వేల కోట్లు దాటింది. ప్రతి రోజూ అక్రమంగా నడిచే మినరల్ వాటర్ ప్లాంట్ల టర్నోవర్ వంద కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా. వేసవి కాలంలో ఈ టర్నోవర్ రెట్టింపు అవుతుంది. ఆంధ్ర, తెలంగాణలో ప్రతి రోజూ 25 లక్షల లీటర్ల వరకు మంచినీటిని అనుమతిలేని వాటర్ ప్లాంట్లు సరఫరా చేస్తున్నాయి. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్ట్స్ (బిఐఎస్) అనుమతి ఉన్న మినరల్ వాటర్ ప్లాంట్లు హైదరాబాద్ పరిసరాల్లో 150కు పైగా ఉంటే, అనధికారికంగా చట్టవిరుద్ధంగా వేల సంఖ్యలో ప్లాంట్లు నడుస్తున్నాయి. వీటి జోలికి వెళ్లేందుకు ఏ అధికారీ సాహసం చేయడు. పేరుకు మినరల్ వాటర్.. కాని ఈ బాటిల్స్‌లో ప్రమాదకరమైన రసాయనాలు, బ్యాక్టీరియా ఉంటాయి. బ్రాండెడ్ కంపెనీ 20 లీటర్ల క్యాన్ ధర రూ.75 ఉంటే, ఊరూ పేరూ లేని క్యాన్ ధర కేవలం రూ.20 నుంచి రూ.25 మాత్రమే. ధర తక్కువ కావడంతో ఎక్కువమంది వీటినే కొనుగోలు చేస్తున్నారు. కొన్ని మినరల్ వాటర్ ప్లాంట్లు బిఐఎస్ అనుమతి ఉన్నట్లు ఐఎస్‌ఐ ముద్రతో విక్రయించడం మామూలైపోయింది.
బ్రాండెడ్ మినరల్ వాటర్ ప్లాంట్లకు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అనుమతి ఉంటుంది. ఈ ప్లాంట్లలో కెమిస్టులు ఉంటారు. బిఐఎస్ ప్రతి నెలా ఈ ప్లాంట్లను తనిఖీ చేస్తుంటుంది. గుర్తింపు పొందిన ల్యాబ్‌లలో నీటిని ఎప్పటికప్పుడు పరీక్ష చేసి బిఐఎస్ ధ్రువీకరణ పత్రం ఇస్తుంది. ఈ ప్లాంట్లు వంద నుంచి 150 లోపు హైదరాబాద్‌లో ఉన్నాయి.
కాని చాలామంది అనధికారికంగా ప్రభుత్వ భూముల్లో, వ్యవసాయ క్షేత్రాల్లో, ప్రైవేట్ స్ధలాలను లీజుకు తీసుకుని తక్కువ పెట్టుబడితో అనుమతులు లేకుండా బోర్లను తవ్వి, వాటిని నాణ్యతలేని ఫిల్టర్లతో వడపోసి విక్రయిస్తున్నారు. వీటిపై మున్సిపాలిటీలు, పంచాయతీలు, రెవెన్యూ శాఖ పర్యవేక్షణ ఉండదు. వీరు ప్రభుత్వానికి ఎటువంటి రుసుము చెల్లించరు. కేంద్ర ప్రభుత్వ అధీనంలోని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్ట్స్ అనుమతులు ఉండవు. ప్రభుత్వం రూపొందించిన వాల్టా (వాటర్, ల్యాండ్ అండ్ ట్రీ) చట్టం కూడా పనిచేయదు. భూగర్భ జలాలను యథేచ్ఛగా తోడేస్తూ, సరిగా శుద్ధి చేయని నీటిని మంచినీరు పేరుతో బాటిల్స్‌ను తీసుకెళ్లే వేలాది వాహనాలు హైదరాబాద్‌తో పాటు రాష్టమ్రంతా దర్శనమిస్తున్నాయి.
జల నిపుణుడు కరుణాకర్ ఎం. రెడ్డి మాట్లాడుతూ ‘వాల్టా చట్టం సెక్షన్ 8 ప్రకారం బోర్లను తవ్వాలంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, గ్రామ పంచాయతీ అనుమతి ఉండాలి. కాని ఇవేమీ అమలు జరగడంలేదు. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్, సిద్దిపేట, మెదక్ తదితర జిల్లాల్లో వెయ్యి గ్రామాల్లో బోర్‌వెల్స్‌ను నిషేధించింది. ఇది మంచిదే అయినా, ఇప్పటికే తవ్విన బోర్ వెల్స్‌పైనా నియంత్రణ లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో సాలీనా రూ.60 వేల కోట్లకుపైగా మంచినీటి వ్యాపారం అక్రమంగా జరుగుతోంది. ఈ ఆదాయంపై పన్నులు లేవు. నియంత్రణలు లేవు’ అన్నారు.
గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్ధతోపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో అనధికారికంగా నడిచే మినరల్ వాటర్ ప్లాంట్లపై ఏ శాఖకూ నియంత్రణ లేదు. ఐఎస్‌ఐ వాటర్ బాటిల్ ప్లాంట్లు నెలకొల్పాలంటే 40 లక్షల రూపాయల వరకు పెట్టుబడి కావాలి. అదే భూగర్భ జలాలను తోడి తూతూ మంత్రంగా శుద్ధి చేసి బాటిల్స్‌లో నింపి అమ్మే ప్లాంట్‌కు రూ. 5 లక్షల లోపు పెట్టుబడి, రెండు వాహనాలు ఉంటే చాలు.
మున్సిపాలిటీల్లో ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు తక్కువ మంది ఉంటారు. వీరికి మినరల్ వాటర్ ప్లాంట్లను తనిఖీ చేసే తీరిక ఉండదు. ఈ ప్లాంట్లలోకి వెళితే అక్కడ తయారయ్యే నీటిని మనం తాగుతున్నామా అనే విధంగా భయానక పరిస్ధతులు దర్శనమిస్తాయి. మంచినీటిలో బ్యాక్టీరియా ఉంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ చట్టం- 2006 కింద ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు చర్యలు తీసుకోవచ్చు. నీరు కాల్షియమ్, మెగ్నీషియమ్, నైట్రేట్, ఫ్లోరైడ్, క్లోరైడ్ లాంటి పూర్తిగా కరిగిపోయే పదార్ధ స్వభావం కలిగి ఉండాలి. ఇవి లీటర్‌కు 500 ఎంజి నుంచి రెండు వేల ఎంజి వరకు ఉండాలి. కాని 50 ఎంజి కంటే తక్కువగా ఉంటే ఆ నీటిని తాగరాదు. పెద్ద హోటళ్లు, ఫంక్షన్ హాళ్లు, ఇళ్లకు, దేవాలయాలకు, ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లు ఇంకా ప్రైవేట్, ప్రభుత్వ సంస్ధలకు ప్రతి రోజూ మంచి నీటి కేన్లు సరఫరా చేసే వాటిలో అధిక భాగం అనుమతి లేని వాటర్ ప్లాంట్లే కావడం విశేషం.