జాతీయ వార్తలు

సర్కారుకు ఎదురుదెబ్బ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 24:రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. రాజధాని అమరావతి నిర్మాణంలో భాగంగా పెనుమాక గ్రామంలో ప్రభుత్వం చేపట్టదలచిన భూసేకరణపై యథాతథ స్థితిని కొనసాగించాలని హైకోర్టు సోమవారం ఆదేశించింది. ఈ మేరకు సిఆర్‌డిఎకు, గుంటూరు జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేసింది. రైతుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలని, వాటిని పరిష్కరించాకే ముందుకు వెళ్లాలని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. గుంటూరు జిల్లా తాడేపల్లి మండల పరిధిలోని పెనుమాక గ్రామంలో 660.83 ఎకరాల సేకరణకు ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రభావం 904 మంది రైతులపై పడుతుందని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. అయితే భూములు ఇచ్చేందుకు ఇష్టపడని 251 మంది రైతులు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ల తరపున న్యాయవాది పి. సుధాకరరెడ్డి వాదనలు వినిపిస్తూ భూ సేకరణ చట్టం -2013లో నిర్దేశించిన నియమ నిబంధనలను అధికారులు గాలికి వదిలి ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేశారన్నారు. గ్రామ సభ, సర్వే నిర్వహించడం వంటివన్నీ ఒక్క రోజులోనే తూతూ మంత్రంగా కానిచ్చేశారని ఆయన పేర్కొన్నారు. నోటిఫికేషన్ విడుదల చేయడానికి ముందు రైతుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోనేలేదని కోర్టుకు వివరించారు. ప్రభుత్వం తరపున డి రమేశ్ వాదనలు వినిపిస్తూ ప్రభుత్వం విడుదల చేసింది ప్రాథమిక నోటిఫికేషన్ మాత్రమేనని, భూ సేకరణ చట్టం ప్రకారం అభ్యంతరాల స్వీకరణకు, పరిశీలనకు 60 రోజుల వ్యవధి ఉంటుందని చెప్పారు. భూ సేకరణ చట్టంలోని సెక్షన్ 15లో పేర్కొన్న నియమ నిబంధనలను అనుసరించి ప్రక్రియ పూర్తి చేశాక తుది నోటిఫికేషన్ విడుదల చేస్తామని వివరించారు. అనంతరం న్యాయమూర్తి జస్టిస్ ఏవి శేషసాయి చట్టంలోని నియమ నిబంధనల మేరకు రైతుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశించారు. అప్పటివరకూ రైతులను వారి భూముల్లో వ్యవసాయ కార్యకలాపాలు చేసుకునేందుకు న్యాయమూర్తి అనుమతి ఇచ్చారు.