రాష్ట్రీయం

ఆంగ్ల భాష అభ్యాసానికి తోడ్పాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 27: ఉద్యోగ - ఉపాధి అవకాశాలు మెరుగుపరచుకునేలా యువతలో ఆంగ్ల భాష ప్రావీణ్యం పెంపొందించే కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం, బ్రిటీష్ కౌన్సిల్ భాగస్వామ్యంతో శ్రీకారం చుట్టింది. ‘ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రాజెక్టు’ కింద రాష్ట్రంలోని ఉన్నత విద్యా సంస్థల్లో చదువుకుంటున్న వారిలో లక్ష మంది విద్యార్థులకు ఆంగ్లాన్ని సులభంగా అభ్యసించేలా శిక్షణ ఇవ్వనుంది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా సమితి (ఎపిఎస్‌సిహెచ్‌ఇ) బ్రిటీష్ కౌన్సిల్ మధ్య భాగస్వామ్యం కుదిరింది. గురువారం సచివాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ముందుగా బ్రిటీష్ కౌన్సిల్‌ను అభినందించారు. ఏడాదిలో లక్ష మంది విద్యార్థులను ఆంగ్ల భాషలో ప్రావీణ్యులను చేయాలని సంకల్పించడం సాధారణ లక్ష్యంకాదని ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్ - ఇంగ్లండ్ నడుమ అనుబంధం ఈనాటిది కాదని, ధవళేశ్వరం, ప్రకాశం, సంగం బ్యారేజీల నిర్మాణంతో తమ రాష్ట్రాన్ని అన్నపూర్ణగా మలిచిన ఘనత ఆనాటి బ్రిటీష్ అధికారులదేనని గుర్తు చేశారు. ఇంగ్లీష్‌పై పట్టు సాధించి యువత ఉద్యోగ - ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకునేందుకు, విద్యా సంబంధిత ఉన్నతికి ‘ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రాజెక్టు’ దోహదపడుతుందని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. ప్రతి విద్యార్థి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థల మధ్య పోటీ వాతావరణం తీసుకువచ్చి మెరుగైన ఫలితాలు రాబడుతున్నామని తెలిపారు. తెలుగు తప్పనిసరిగా అభ్యసిస్తునే ఇంగ్లీష్, హిందీ ఇంకా ఒకటి రెండు స్వదేశీ, విదేవీ భాషల్లో ప్రావీణ్యం సంపాధించేలా విద్యార్థులను ప్రోత్సహిస్తున్నామని వెల్లడించారు. ఇటు లక్ష మంది విద్యార్థులకు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించే ప్రాజెక్టుపై బ్రిటీష్ కౌన్సిల్‌తోనూ, అటు రెండు బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రంలో అడుగుపెడుతున్న కియా మోటార్స్‌తోనూ అవగాహన ఒప్పందాలు ఒకేరోజు చేసుకోవడం తనకు ఎంతో సంతోషం కలిగించిందని బాబు అన్నారు. ఈ ప్రాజెక్టు రాక కేవలం విద్యార్థులకే కాకుండా ఆంగ్ల భాష అధ్యాపకులకు ఉపకరిస్తుంది. అధ్యాపకులు తమ బోధనా పద్ధతులు ఉత్తమంగా ఉండేలా, సంభాషణ చాతుర్యం ఉన్నత రీతిలో సాగేలా తీర్చిదిద్దుకునేందుకు వీలు కలుగుతుంది. అధ్యాపకుల శిక్షణ కోసం మాస్టర్ ట్రైనర్లు అందుబాటులో ఉంటారు. వీరంతా విదేశీ పని వాతావరణానికి తగినట్టుగా విద్యార్థుల్లో స్పోకెన్ ఇంగ్లీష్ సమార్ధ్యం పెంచేందుకు తోడ్పాటు అందిస్తారు. ఈ కార్యక్రమంలో మంత్రి గంటా శ్రీనివాసరావు, బ్రిటీష్ కౌన్సిల్ ఎండి మైఖేల్ కింగ్, డైరెక్టర్ అలెన్ గెమ్మెల్ పాల్గొన్నారు.

చిత్రం..చంద్రబాబు సమక్షంలో బ్రిటిష్ కౌన్సిల్‌తో ఎంఓయు కుదుర్చుకుంటున్న దృశ్యం